అమరావతి, మహానాడు: వరద బాధితులకు ఇండియన్ టొబాకో అసోసియేషన్(గుంటూరు) సాయం అందించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బుధవారం 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ పోలిశెట్టి శ్యాంసుందర్, సెక్రెటరీ వై ఎ చౌదరి, వైస్ ప్రెసిడెంట్ లు ఎం.రమేష్ బాబు, ఆర్ జీవన్, ట్రెజరర్ గుత్తా వాసుబాబు, ఐటిసి నుండి పి.వెంకట్రామిరెడ్డి, వీఎస్‌టీ ఇండస్ట్రీస్ నుండి డాక్టర్ టి.లక్ష్మీనరసయ్య పాల్గొన్నారు. అలాగే, మెస్సేర్స్ పోలిశెట్టి శామ్ సుందర్ రూ. 10 లక్షలు విరాళంగా సీఎంకు అందజేశారు.