అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ఎస్పీ ఆకస్మిక తనిఖీ

పొందుగల, మహానాడు: పల్నాడు జిల్లాలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ పొందుగల చెక్ పోస్ట్ ను ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏమన్నారంటే… అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులు పనితీరు చాలా కీలకం. తెలంగాణ రాష్ట్రం నుండి పల్నాడు జిల్లాలోకి అక్రమంగా మద్యం నగదు, ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి. అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం, నగదు దొరికితే చట్టపరమైన చర్యలు ఉంటాయి. వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేయాలి. ప్రతి చెక్ పోస్ట్ వద్ద పోలీస్ సిబ్బంది, అధికారులచే నిత్యం వాహనాలను ఆపి పరిశీలిస్తూ, నిషేధిత వస్తువులు, మద్యం, నగదు అక్రమ రవాణా ను అరికట్టుటకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ తనిఖీలో దాచేపల్లి సీఐ జి.వెంకటరావు, ఎస్‌.ఐ శివ నాగరాజు పాల్గొన్నారు.