టిడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు అడ్డుకట్ట!

– మంత్రి నారాయణ

అమరావతి, మహానాడు: టిడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి నారాయణ వెల్లడించారు. మున్సిపల్, టౌన్ ప్లానింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి మంగళవారం కీలక సమావేశం నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టౌన్ ప్లానింగ్ విభాగాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానం చేసేలా నిర్ణయం.. బాండ్ల జారీలో అక్రమాలకు రావు లేకుండా అవసరమైన చర్యలను రిజిస్ట్రేషన్ శాఖ తీసుకోవాలి. టౌన్ ప్లానింగ్ విభాగం తో రిజిస్ట్రేషన్ శాఖ అనుసంధానం చేసేలా ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపకల్పన. సర్వే నెంబర్లు, ఈసీలు, ఓనర్ షిప్ డాక్యుమెంట్లు జారీ పారదర్శకంగా ఉండేలా సాంకేతికంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సమావేశానికి మున్సిపల్ శాఖ డైరెక్టర్ హరి నారాయణన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శేషగిరి బాబు, పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ విద్యుల్లత హాజరయ్యారు.