– అప్పులాంధ్రప్రదేశ్ చేశారే తప్పా…అభివృద్ధి చూపలేదు
– వైసీపీ నేతల వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశం
– ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి
ఉమ్మడి రాజధాని మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే…ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా ? మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా ? 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలే. రాష్ట్రానికి రాజధాని లేదు.ప్రత్యేక హోదా రాలేదు.
ప్రత్యేక ప్యాకేజీలు లేవు.పోలవరం పూర్తి కాలేదు. కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు దిక్కులేదు. కొత్త పరిశ్రమలు లేవు. ఉన్నవి ఉంటాయో లేదో తెలియదు. 8 లక్షల కోట్ల అప్పులు చేసి అప్పులాంధ్రప్రదేశ్ చేశారే తప్పా…అభివృద్ధి చూపలేదు.మోడీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే కానీ విభజన హామీలపై ఏనాడూ నోరు విప్పలేదు.
ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితి.చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది 3D గ్రాఫిక్స్ అయితే… మూడు రాజధానుల పేరుతో జగనన్న ఆడింది మూడు ముక్కలాట. పూటకో మాట,రోజుకో వేషం వేసే వైసీపీ నేతల వైఫల్యాలను..
కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశం. ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్పా.. వైసీపీ కి రాజధానిపై,రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ది లేదు.