విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
ప్రజాధనం పందికొక్కులా మెక్కడానికి సిగ్గులేదా? జనం సొమ్ము అయితే చాలు నిమ్మకాయ నీళ్లలా 28లక్షలు దిగమింగేశావు. వైసీపీ పాలనలో గడ్డం గ్యాంగ్ గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవానికి నిమ్మకాయ నీళ్ల కోసమంటూ జనం సొమ్ము 28 లక్షలు దోచేశారు. ఆ టిడ్కో ఇల్లు ఒక్కో పేదకి మంజూరు చేయడానికి 3 లక్షల నుంచి 4 లక్షలు దండుకున్నారు. గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి 70 లక్షలు బిల్లులు చేసుకోవడానికి గడ్డం గ్యాంగ్ విశ్వప్రయత్నాలు చేసింది. అమృత్ పథకం కింద పనులు చేయకుండానే కోట్లు కొల్లగొట్టేశారు. ఐదేళ్ల జగన్ పాలనలో గడ్డం గ్యాంగ్ గుడివాడ నియోజకవర్గాన్ని గుల్ల చేసిందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.