ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి, మహానాడు : అందరూ హర్షించేలా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన ప్రారంభమయ్యాక పెంచిన సామాజిక పింఛన్లను రెండో నెలలోనూ విజయవంతంగా లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పంపిణీ చేశారు. 64 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు రూ.2737.4 కోట్ల మొత్తాన్ని ఈ రోజు ఉదయం నుంచి ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన కార్యక్రమం ప్రజలకు చేరువైందన్నారు. గత పాలకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసినా సంక్షేమ పథకాల అమలుకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.