తెనాలి పద్మశాలీ ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని
తెనాలి, మహానాడు : పద్మశాలీ పేదలకు రెండు సెంట్ల స్థలంలో ఇల్లు లేదా టిడ్కో నివాసాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెనాలి నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో గురువారం జరిగిన పద్మశాలీ ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి పెమ్మసాని విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. పెమ్మసాని మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేకు సమస్యలపై అవగాహన లేదన్నారు. ఈ కార్యక్రమంలో చిల్లపల్లి శ్రీనివాసరావు, అవ్వారు శ్రీనివాసరావు, దివి అనిత, దివి హేమంత్, పడవల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.