– రాజధానిలో మంత్రి నారాయణ పర్యటన
అమరావతి, మహానాడు: రాజధానిలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ శనివారం పర్యటించారు. వెంకటపాలెం, శాఖమూరులో నర్సరీలు, పార్కులను మంత్రి నారాయణ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్శన్ లక్ష్మీ పార్థసారథి పరిశీలించారు. శాఖమూరులోని సెంట్రల్ పార్కులో ల్యాండ్ స్కేపింగ్ యంత్రంతో మంత్రి నారాయణ స్వయంగా గడ్డి చదును చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి. నిన్నటి వరకూ 50 శాతం జంగిల్ క్లియరెన్స్ పూర్తయింది. రాజధాని లో భవనాలు, రోడ్ల తో పాటు మంచి ఎన్విరాన్మెంట్, పార్కులు ఉండాలి. అందుకే నాలుగు పెద్ద పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. శాఖమూరులో 300 ఎకరాల్లో సెంట్రల్ పార్క్ నిర్మాణం. వచ్చే ఆరు నెలల్లో నాలుగు పార్కు లు పూర్తి చేయాలని నిర్ణయం. రాజధాని నిర్మాణానికి గతంలో ఇచ్చిన టెండర్లను రద్దు చేసి మళ్ళీ కొత్తగా టెండర్లు పిలుస్తాం. అమరావతిలో పనులు ప్రారంభానికి మరో మూడు నెలలు పడుతుందని మంత్రి తెలిపారు.