- పింఛన్ల పెంపుతో లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం
- రికార్డు స్థాయిలో గత నెలలో మొదటి రోజు 95 శాతం, రెండో రోజుకు 99 శాతం ఫించన్ల పంపిణీ
- ప్రజాకాంక్ష లకు అనుగుణంగా పనిచేసే కూటమి ప్రభుత్వంపై విమర్శలు సరికాదు
- ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తాం
- రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి
సింగరాయకొండ: ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ రూ. 4 వేలు పెంచామని, ఫించన్ల పెంపుతో లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం నాడు ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు స్వయంగా మంత్రి పింఛన్ అందజేశారు.
అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ….. ఎన్నికల్లోఇచ్చిన హామీ ప్రకారం మొదటి నెలలో రూ. 7,000 పింఛన్ ఇచ్చాం. ఈ నెల రూ.4 వేలిచ్చాం. పింఛన్ల పెంపుతో లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రతా పించన్లను ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమే. ఎన్టీఆర్ హయాంలో నెలకు రూ.35చొప్పున అందించగా తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే దానిని రూ.75కు పెంచారు.
2004 ఎన్నికల ప్రచారంలో పెన్షన్లను రూ.200 చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే..రూ.25మాత్రమే పెంచారు. ఒకేదఫా చేస్తామని చెప్పలేదని దబాయిస్తూ.. ఏడాదికి రూ.25చొప్పున అంటూ నాడు వైఎస్ మోసం చేశారు. 2014 జూన్ 8న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే పెన్షన్లను రూ.1,000కి పెంచారు. తరువాత రూ.1,000 నుంచి రూ.2వేలు చేశారు.
నాడు పెన్షన్లను రూ.3000లకు పెంచుతానని ఎన్నికల ప్రచార సమయంలో, వైసీపీ మేనిఫెస్టోలో, పాదయాత్రలో ప్రకటించి అధికారంలోకి వచ్చాక ఏడాదికి కేవలం రూ.250 చొప్పున పెంచి మోసం చేశారు.
పని చేసే ప్రభుత్వంపై విమర్శలు సరికాదని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, సింగరాయకొండ సుందర్ నగర్ లో అంగన్వాడి పాఠశాలను సందర్శించి చిన్నారులతో మంత్రి ముచ్చటించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ విధ్వంసం చేస్తే మేము అభివృద్ధి చేస్తున్నాం. పాఠశాలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవు, తరగతి గదులు కూడా సరిగా లేవు, వంటగది మరుగుదొడ్లు లేవు. గత ప్రభుత్వం చెప్పిన నాడు నేడు అంటే ఇదేనా ? వైసిపి ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు సింగరాయకొండల మండల అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు