గుంటూరు, మహానాడు: ప్రకాష్ రాజ్ సినిమాల్లో నటించుకుంటే ఆయనకే మంచిదని మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత కిలారి రోశయ్య సలహా ఇచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే.. ఇక్కడ రాజకీయాలు ఆయనకు ఎందుకు? మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్యమతస్టులు డిక్లరేషన్ ఇస్తే తప్పు ఏముంటుంది? తనకి ఏమి పోతుంది? వైసీపీలో కోటరీ రాజకీయాలు ఉన్నాయి. ఆపార్టీ గురించి మాట్లాడుకోవడం అనవసరం. దేవాలయాల్లో సరైన పద్ధతులు పాటించక పోవడం వల్లే రాష్ట్రంలో సమస్యలు ఏర్పడుతున్నాయి. పవన్ కల్యాణ్ దీనిపై దృష్టి సాస్తున్నారు. వైసీపీ నేడు దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి లో అందర్నీ కలుపుకొనిపోతాం.