– ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు హాజరు
వేమూరు, మహానాడు: భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు హాజరై, ఇంటింటికి వెళ్లి వంద రోజుల ప్రభుత్వం గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు 100 రోజుల ప్రభుత్వం చాలా బాగుంది అన్నారు. ఇంకా గ్రామంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు వివరించారు. త్వరలోనే అవన్నీ పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం మొదలు పెట్టామన్నారు.
చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని నమ్మి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేశారు. కాబట్టే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే పరిమితం అయ్యారన్నారు. అవినీతి, దోచుకోవడం తప్పితే గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదు… ప్రజలకు మంచి చేయకపోతే ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పాలల్లో రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి పోయింది.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రాష్ట్ర యువతకి భవిష్యత్తు ఏంటో తెలీదు… గంజాయికి అలవాటు చేశారని విమర్శించారు.