సక్సెస్ అయిందని కళ్లమంట! 

బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాలపై  వీడియోలు 
అవమాన పరిచే విధంగా  తీసిన వారిపై చర్యలు 
– రవాణా, బీసీ సంక్షేమ శాఖ  మంత్రి పొన్నం ప్రభాకర్ 

హైదరాబాద్, మహానాడు :  కళ్ల మంటతోనే… ఆర్టీసి బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాలపై కావాలని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వస్తున్నాయని, వాటి మీద చర్యలు తీసుకోనున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీ లో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ..

హుజురాబాద్ నుండి జమ్మికుంట వెళ్తున్న బస్సులో ఊరికే వెళ్లి పాయలు తీసుకుంటూ వెళ్తున్నారని వీడియోలు వచ్చాయి. రవాణా శాఖ మంత్రిగా డిసెంబర్ 9 నుంచి మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యం పై స్కీమ్ సక్సెస్ అయిందని మొదటి నుండి కల్ల మంట జరుగుతుంది. ఆటో కార్మికుల పేరు మీద మాట తెస్తున్నారు. మీకు మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడం ఇష్టం లేదా? వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీలో 70 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు.

మహిళను అవమాన పరిచే విధంగా ఏం పని లేక  తిరుగుతున్నారనీ అవహేళన గా వస్తున్న వీడియోల మీద చర్యలు తీసుకోవాలి. మెట్రో వచ్చిన తరువాత 5 లక్షల మంది ప్రయాణికులు వెళ్తున్నారు. అప్పుడు ఆటోల మీద ప్రభావం పడలేదా…? ఓల ,ఉబర్ వాళ్ళు తరువాత ప్రభావం పడలేదా..? ఒక పరిణామం జరిగినప్పుడు ఇంకో పరిణామం మీద ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం పడకుండా సూచనలు చేయాలి. అవహేళనగా వీడియోలు ఎవరు సృష్టిస్తే వారి మీద చర్యలు తీసుకోవాలి.షూటింగ్ లు చేసి పెట్టే వీడియోలపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.