ఫేక్ వార్తలు, ఫేక్ ప్రచారాలతో ప్రజల్లో విద్వేషాలు

-జగన్ రెడ్డి రోజుకొక కుట్ర 
– ఎమ్మెల్యే నసీర్

గుంటూరు, మహానాడు: ఫేక్ వార్తలు ఫేక్ ప్రచారాలతో రాష్ట్ర ప్రజల్లో విద్వేషాలు సృష్టించేందుకు జగన్ రెడ్డి రోజుకొక కుట్ర చేస్తున్నాడని గుంటూరు నగరం తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి  ప్రభుత్వం మీద అబద్ధాలు అసత్య ఆరోపణలు చేయడం వైసీపీకి అజెండాగా మారిందన్నారు.

గిరిజన మహిళను వైసీపీ నేత విజయసాయిరెడ్డి వంచించిన విషయం  సాక్ష్యాధారాలతో సహా బట్టబయలైనందువల్ల ఈ అంశాన్ని  పక్కదారి పట్టించేందుకు వినుకొండలో వైసీపీ కార్యకర్తల అంతర్గత వివాదాన్ని మా పార్టీపై నెట్టేందుకు జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో ఇద్దరు మైనార్టీ సోదరులు జిలాని, రషీద్ ల మధ్య జరిగిన వివాదంలో ఒకరు బలయితే దానిని కూడా తెలుగుదేశం పార్టీ పై నెట్టే కుట్రలు చేస్తున్నారన్నారు.

మృతుడు రషీద్, హంతకుడు జిలాని వీరి ఇరువురు గతంలో వైసీపీ పార్టీకి చెందిన వారేనని గుర్తు చేశారు. గత ఏడాది తొలి ఏకాదశి రోజున వినుకొండలో వీరి మధ్య తలెత్తిన వివాదం అన్నారు. రషీద్ వల్ల వేధింపులకు గురవుతూ జిలాని హంతకుడుగా మారాడని వారిరువురి మధ్య ఉన్న గొడవలు వల్ల జరిగిన హత్యకు  ఈ సంఘటనకు రాజకీయ రంగు పులవటం దుర్మార్గమన్నారు .

జగన్ శవ రాజకీయాలు చేయడం వైసీపీ పార్టీ కార్యకర్తల  మధ్య వ్యక్తిగత వ్యవహారం  వినుకొండలో జరిగిన హత్య కారణమైతే బెంగళూరు నుంచి వినుకొండ కి హడావుడిగా వచ్చి ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం సరికాదన్నరు. అబద్ధాలు అసత్యాలు అవినీతి కలిపితే జగన్ రెడ్డి అనే విషయం  వినుకొండ సంఘటన ద్వారా మరోసారి స్పష్టమైందని అన్నారు. కర్నూలు జిల్లాలో అబ్దుల్ సలాం కుటుంబం బలవన్మరణానికి కారణం వైసీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు.

నరసరావుపేటలో మసీదు స్థలం కాపాడటానికి ప్రయత్నించిన మైనారిటీ నేత ఇబ్రహీంను నడిరోడ్డుపై గొంతు కోసి చంపిన వైసీపీ నేతలను కాపాడింది తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు కాదా అని గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్ల పాలనలో  సుమారు 18 మందికి పైగా మైనార్టీల సోదరులను హతమార్చి వారి ఆస్తులను వైసీపీ నేతలు కబ్జా చేశారన్నారు.

ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 11 సీట్లకి వైసీపీ నేతలను పరిమితం చేశారని అయినా జగన్ సైకో  ప్రవర్తన మారలేదన్నారు. కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి అండ్ కో చేస్తున్న ఆరోపణలు ప్రజలు  గమనించాలన్నారు. వైసీపీ నేతల కల్లబొల్లి మాటలు నమ్మొద్దు అని అన్నారు రాష్ట్ర ప్రజలు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి చిట్టి బాబు ఉన్నారు.