-టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
సొంత బాబాయ్‌ని, ఓటేసి గెలిపించిన ప్రజల్ని, చివరికి ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేశాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశాడు. ఓటమి భయంతో ఈవీఎంల ధ్వంసంతోపాటు దాడులకి తెగబడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘం కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. వైసీపీ ఫ్యాక్షన్ పాలిటిక్స్‌కి జూన్ 4న ప్రజలు అసలు సిసలు తీర్పు ఇవ్వబోతున్నారు.