జగన్‌కు రాజకీయ నేత లక్షణాలు లేవు!

– జనసేన నేతలు గాదె, చందు విమర్శ

గుంటూరు, మహానాడు: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ నాలుగు నెలల పాలనలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికే సరిపోయింది… ఆకస్మిక వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను ఆదుకుని పరిపాలిస్తోందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, ఆ పార్టీ నేత చందు సాంబశివరావు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే.. వైసీపీ అధినేత జగన్‌ గుంటూరు వచ్చి గగ్గోలు పెట్టి విచక్షణ లేకుండా మాట్లాడటం సిగ్గుపడాల్సిన విషయం.. జగన్మోహన్ రెడ్డి కి వాస్తవంగా రాజకీయ నేత లక్షణాలు లేవు.. అన్ని కుటిల రాజకీయాలే కనపడుతున్నాయి…

అందరినీ తల్లి, చెల్లి అనే జగన్మోహన్ కు సొంత తల్లి, చెల్లిని అన్యాయం చేస్తున్నప్పుడు ఆ మాటలు గుర్తుకు రాలేదా?

దళిత చెల్లి, బీసీ చెల్లి అని కుతంత్ర మాటలు మాట్లాడటం చూస్తే ఏమి చెయ్యాలో అర్ధం కావడం లేదు… వైసీపీ ప్రభుత్వం లో రౌడీ షీటర్ నవీన్ అని అతని తల్లి స్పష్టం చేసినా ఇంకా ప్రభుత్వం పై బురదజల్లడానికి మాత్రమే వచ్చారు… జగన్మోహన్ ముఖ్యమంత్రి హయాంలో గుంటూరు నగరంలో యువతిని దారుణంగా హత్యచేస్తే వచ్చి పరమర్శించలేని నువ్వు హెలికాఫ్టర్ లో వచ్చి గందరగోళం చేయడం ఏమిటి?

గుంటూరు సహనా ఘటనపై జగన్మోహన్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా? దళితుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. శవం కోసం ఎదురుచూసే రాజకీయ నేత జగన్మోహన్ రెడ్డీ…. ఇప్పటికైనా తీరుమార్చుకో….