– వైసీపీకి గుడ్‌బై చెప్పిన అనంతరం వాసిరెడ్డి పద్మ ఆగ్రహం
విజయవాడ, మహానాడు: గుడ్ బుక్ పేరుతో కార్యకర్తలను, ప్రజలను మరోసారి మోసం చేయడానికి జగన్ సిద్ధపడుతున్నారు… వైసీపీకి గుడ్‌బై….. నా రాజీనామాను మీడియా ద్వారా తెలియచేస్తున్నానని ఏపీ మహిళా కమీషన్ మాజీ ఛైర్‌పర్సన్, వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే.. నేను మహిళా చైర్ పర్సన్ గా ఉండగా, అనేక విషయాలు నాడు ప్రభుత్వం ముందు పెట్టినా పట్టించుకోలేదు. మహిళల విషయంలో ఇప్పుడు జగన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు. జగన్ రెడ్డి పాలన ఏమైనా మహిళలకు స్వర్ణయుగమా? రోజుకో వికృతమైన ఘటన నాడు మహిళల పై జరిగినా, ఏ నాడు జగన్ రెడ్డి బయటకు రాలేదు. ఒక్క పరామర్శ చేయలేదు. ఆ రోజు హోంమంత్రి స్పందించేది కాదు. చాలా విషయాలు నాడు తొక్కి పెట్టారు. ఇప్పుడు మాత్రం రాజకీయం చేయటానికి వస్తున్నారు. నీకు రాజకీయం చేయటానికి మహిళలే దొరికారా?