జగన్‌ మహిళల రక్షణపై మాట్లాడుతుంటే నవ్వొస్తోంది…

– మీడియాతో టీడీపీ నేతలు ఆలపాటి, రాజా, గళ్ళా మాధవి, మాణిక్యాలరావు

గుంటూరు, మహానాడు: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెనాలి యువతి సహనా ఘటనపై పరామర్శకు వచ్చి మాట్లాడిన మాటలు చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టు… సత్యహరిచంద్రుడు తమ్ముడిలాగా మాట్లాడుతున్నారు.. గత 5సం. లు రాష్ట్రాన్ని రావణాకాష్ఠం చేసి గంజాయి వనంగా మార్చారు. నేడు పరామర్శల పేరుతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారా…? అని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేతల ఆలపాటి రాజా దుమ్మెత్తిపోశారు. ఈ మేరకు రాజా, ఎమ్మెల్యే గళ్ళా మాధవి, పిల్లి మాణిక్యాలరావు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజా మాట్లాడుతూ గత 5సం. ల క్రితం తాడేపల్లి ప్యాలెస్ పక్కన యువతిపై అఘాయిత్యం జరిగితే పట్టించుకున్న పాపాన పోలేదు… మీ నేతలు చేసిన కోనసీమ అల్లర్లు, సొంతబాబాయ్ హత్య, మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.

టీడీపీ నేతలపై ఇష్టానుసారంగా మాట్లాడటం చూస్తే వైసీపీ నేతలు తీరు ఇంకా మారలేదని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డికి సిగ్గూశరం లేకుండా మహిళ జాగ్రత్తలు, రక్షణ గురించి మాట్లాడటం చూస్తే నవ్వొస్తుంది… మానవత్వం తో మాట్లాడండి రాజకీయ లబ్ధి కోసం మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి మానుకోవాలని హితవుపలికారు. బీసీ నేత చంద్రయ్యను అత్యంత పాశవికంగా హత్యచేస్తే, వివక్ష రాజకీయాలు చేసిన మీరు కుడా మాట్లాడుతున్నారు అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసీపీ జులం సాగించాలని చూస్తే టీడీపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని గట్టిగా హెచ్చరించారు. అలాగే, గళ్ళా మాధవి ఏమన్నారంటే.. తెనాలిలో యువతిపై జరిగిన ఘటన గుంటూరు వరకు చేర్చి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు… శవాలపై రాజకీయాలు వైసీపీ నేతలకు కొత్తకాదు వారికి వెన్నతో పెట్టిన విద్య… వైసీపీ రౌడీ షీటర్ నవీన్ చేసిన అకృత్యాన్ని టీడీపీ ప్రభుత్వానికి అంటగట్టాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు… 30వేల మంది మహిళలు వైసీపీ హయాంలో మాయమైపోతే ఇంతవరకూ సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది…

వైసీపీ అధినేతను ప్రజలు తిరస్కరించినా శవం కనపడితే చాలు రాజకీయాలు చేయడానికి వైసీపీ పరుగులు పెడుతోంది. టీడీపీ ప్రభుత్వం జరిగిన ఘటనకు బాదాప్త హృదయంతో సహనా కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తే దానికి కూడా రాజకీయాలు అంటగట్టడం సిగ్గుచేటు… వైసీపీ అధినేత అవివేకి అని ప్రజలు తిరస్కరించినా సిగ్గులేకుండా ప్రజలలోకి రావడం దారుణం.. శవరాజకీయలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.. పిల్లి మాణిక్యాలరావు ఏమన్నారంటే.. ఏపీలో పులివెందుల ఎమ్మెల్యే ప్రేతాత్మ తిరుగుతోంది… అధికారంలో ఉన్న 5సం. లు దళితులు, బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేకుండా చేసిన సిగ్గుమాలిన వ్యక్తి జగన్… 2021 ఆగస్ట్15 వైసీపీ కార్యకర్త నడిరోడ్డుపై కత్తితో పొడిచి లక్ష్మి ని హత్యచేస్తే పరామర్శకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు…

వైసీపీ నేతలు అనంత బాబు, దువ్వడాలను పక్కన పెట్టుకొని తిరిగే జగన్మోహన్ రెడ్డి మహిళల రక్షణ గురించి మాట్లాడటం సిగ్గుచేటు… పులివెందుల నాగమ్మ అనే మహిళను హత్య చేస్తే పరామర్శించిన దాఖలాలు లేవు, పరిహారాలు లేవు… ఇప్పుడు మాత్రం అన్ని గుర్తుకు వస్తాయి… రెపల్లెలో జరిగిన ఘటనలో బాలికపై అఘాయిత్యం చేస్తే మీ మహిళా హోం మంత్రులు ఏమయ్యారని గుర్తు చేశారు… సహనా ఘటనలు టీడీపీ నేతలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కుటుంబ సభ్యులకు తగు ప్రాధాన్యత కల్పించారని.. తల్లీచెల్లికి అన్యాయం చేసి కోర్టుకు పోయినా నువ్వు కూడా న్యాయం గురించి మాట్లాడటం చూస్తే ఆశ్చర్యమేస్తోంది. దిశా యాప్ పేరుతో మహిళలను మోసం చేయాలని మరొకసారి ప్రజలలోకి వచ్చారు.. గత వైసీపీ హయాంలో తెనాలిలో గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు చేయించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కూడా మాట్లాడటం చూస్తే ఆవేదన కలుగుతోంది.. రాష్ట్రంలో అభివృద్ధి కోసం పనిచేసే చంద్రబాబును విమర్శించే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు.