– మంత్రి లోకేష్ ఘాటు విమర్శ
అమరావతి, మహానాడు: బుడమేరు పొంగడానికి ప్రధాన కారణం జగన్.. ఇది జగన్ మేడ్ డిజాస్టర్ అని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఘాటుగా విమర్శించారు. ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్న మీకు ఆ హుందాతనం ఉందా జగన్? బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారి అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి దుమ్మెత్తిపోశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాస్ పోర్ట్ సమస్య లేకపోతే ఎప్పుడో లండన్ ఎగిరిపోవాల్సిన మీరు బెంగుళూరు ప్యాలస్ లో రిలాక్స్ అవుతూ 74 ఏళ్ల వయస్సు లో క్షణం తీరిక లేకుండా వరద బాధితులకు సాయం అందిస్తున్న చంద్రబాబుపై విమర్శలు చేయడానికి మనస్సు ఎలా వచ్చింది?…
విపత్తులు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ అందజేసిన చరిత్ర మీకు లేదు..పైగా మీరు ప్రకటించే సెల్ఫ్ చెక్స్ కథ అందరికీ తెలిసిందే! నాడు చంద్రబాబు బుడమేరు ఆధునీకరణకు రూ.464 కోట్లు కేటాయించి పనులు ప్రారంభిస్తే మీ రివర్స్ పాలనలో పనులు నిలిపి విపత్తుకు ప్రధాన కారణం అయ్యారని విమర్శించారు.
ఆధునీకరణ, మరమ్మతుల పనులు ఆపేశారు. సుమారుగా రూ.500 కోట్లు విలువైన 600 ఎకరాలు వైసీపీ నాయకులు కబ్జా చేశారు. 2022 లోనే గండి పడినా పట్టించుకోలేదు. అయిదేళ్ళలో సరైన నిర్వహణ లేదు. విజయవాడ నగరంలో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులు ఆపేశారు. మీ పాలన వైఫల్యాలే నేడు ప్రజల కష్టాలు! అన్ని సమస్యలను అధిగమిస్తాం… చివరి వరద బాధితుడికి సాయం అందించే వరకూ విశ్రమించం.. అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.