– గ్రీవెన్స్ లో ఓ మహిళ ఫిర్యాదు
– భూ కబ్జాలపై పోటెత్తిన అర్జీలు
– స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు
మంగళగిరి, మహానాడు: కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లి గ్రామానికి చెందిన జొన్నలగడ్డ శివలీల మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో ఆమె అర్జీని అందిస్తూ.. తాము కొనుగోలు చేసిన భూమిని వైసీపీ నేతలు కబ్జా చేసి తమను పోలంలోకి వెళ్లనివ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఆ పొలమే ఆధారమని.. పొలం దగ్గరకు వెళితే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆఫీసుకు తమను పిలిచి భయపెట్టారని శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, శాసనమండలి సభ్యులు పర్చూరి అశోక్ బాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, బుచ్చిరాం ప్రసాద్ లకు ఆమె మొరపెట్టుకున్నారు.
తమకు న్యాయం చేయాలని ఆమె వేడుకొన్నారు. స్పందించిన ఎమ్మెల్యే యార్లగడ్డ అర్జీపై అధికారులను ఫోన్ చేసి విచారించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఆమెను ఓదార్చారు. దాంతో పాటు వచ్చిన వినతులపై అధికారులకు ఫోన్లు చేసి సమస్యలు తెలియజేస్తూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు వెనువెంటనే కృషి చేయాలని నేతలు కోరారు.
• ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నం జూపూడి గ్రామానికి చెందిన సుగుణ విజ్ఞప్తి చేస్తూ.. తమకు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం హెచ్ నిడమానూరు గ్రామంలో వారసత్వంగా వచ్చిన భూమి ఉందని… తన మామగారి మరణాంతరం తన భర్త ఆ భూమికి వారసుడుగా ఉండగా.. ఆ భూమిని జగన్ రెడ్డి బంధువు అని చెప్పుకుంటున్న వైసీపీ నేత నల్లమలపు కృష్ణారెడ్డి( బుల్లెట్ కృష్ణారెడ్డి) కబ్జా చేశాడని… అతనిపై చర్యలు తీసుకోని తమ భూమి తమకు ఇప్పించాలని ఆమె గ్రీవెన్స్ లో వాపోయారు.
• చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్లకు చెందిన ఓ మహిళ నేడు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేస్తూ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోద్భలంతో మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథరెడ్డి సోదరుడు జగన్నాథరెడ్డితో అధికారులు కుమ్మక్కై తమ భూమిని కొట్టేసేందుకు కుట్రపన్నారని. భూమిలోకి వెళ్లకుండా చేస్తున్నారని.. దానిపై విచారించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు.
• మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రోద్భలంతో ఆయన బినామీ రామవరపు శంకరమూర్తి మరికొందరు కలిసి వడ్డెర కులస్తులు శ్మశానం కోసం కొనుగోలు చేసిన భూమిని కబ్జా చేసి 400లకు పైగా సమాధులను ధ్వంసం చేశారని… తిరిగి తమపైనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తోన్నారని మాచర్ల నియోజకవర్గం వడ్డెర సంక్షేమ సంఘం సభ్యులు నేడు గ్రీవెన్స్ లో మొర పెట్టుకున్నారు.
• బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామానికి చెందిన పాలడుగు కస్తూరి విజ్ఞప్తి చేస్తూ.. తమకు సంబంధించిన పొలం 5. 81 సెంట్ల భూమిలో 30 అడుగుల మేర మట్టిని తవ్వేసి అక్రమంగా మట్టిని తోలుకు పోయారని.. తమ పొలం జాడ లేకుండా చేశారని… పొలం సరిహద్దులు కొలిచి ఇవ్వాలని సర్వేయర్ ను అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని.. సర్వేయర్ ఫణిపై చర్యలు తీసుకోని తమ భూమిలో మట్టి తవ్వకాలకు కారకులపై చర్యలు తీసుకోవాలని బాధితులు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
• తిరుపతి జిల్లా నాగలాపురం మండలం రాజల కండ్రిగ గ్రామానికి చెందిన దొమ్మరాజు శాంతి విజ్ఞప్తి చేస్తూ.. తన తండ్రి మరణాంతరం ఆ ఆస్తి తన తల్లి, తనకు రాకుండా తన తండ్రి సోదరుడులు అడ్డుకుంటున్నారని.. రాత్రుల్లో ఇంటికి వచ్చి చంపుతామని బెదిరిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు
• వైసీపీ వాళ్లు తన ఇంటి స్థలాన్ని ఆక్రమించుకొన్నారని దానిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా.. తనపైనే దాడులు చేసి అక్రమ కేసులు పెట్టారని గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన వెంకాయమ్మ విన్నవించారు. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
• గత ప్రభుత్వం తమను మోసం చేసిందని.. కార్మికులకు కనీస వేతనం రూ.21 వేలు చెల్లిస్తామని ఒక్క మున్సిపల్ శాఖలో మాత్రమే అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వ వైద్య సంస్థలలో పనిచేస్తున్న పారిశుద్ధ్యం, భద్రతా, చెదపురుగుల నివారణ సిబ్బందిని గాలికొదిలేసిందని.. కనీస వేతనం 16 వేలు ఇస్తామని ఉత్తర్వులు జారీ చేసినా ఇచ్చింది మాత్రం.. ప్రాంతాన్ని బట్టి ఒకచోట రూ. 9వేలు, మరోచోట రూ10 వేలు, ఇంకొన్ని చోట్ల రూ. 12 వేలు మాత్రమే జీతంగా ఇచ్చి తమకు తీవ్ర అన్యాయం చేశారని వారు నేడు గ్రీవెన్స్ లో లబోదిబోమన్నారు. తమకు కనీస జీతం ఇవ్వాలని వేడుకున్నారు.
• తనకు ప్రభుత్వం ఇచ్చిన పొలాన్ని అక్రమంగా అన్ లైన్ లో తొలగించి సుంకర ప్రసాద్ పేరుపై తహశీల్దార్ మార్చారని.. ఈ అక్రమానికి పాల్పడిన తహశీల్దార్, సుంకర ప్రసాద్ లపై చర్యలు తీసుకోవాలని శ్రీ కాశినాయన మండలం సావిశెట్టి పల్లె గ్రామ పంచాయతీకి చెందిన మిద్దె నారాయణమ్మ గ్రీవెన్స్ లో నేతలకు విజ్ఞప్తి చేశారు.
• భూమి హక్కు దారులు ఎవరో వాస్తవికతను వెరిఫై చేయకుండా వ్యవసాయ భూమిని చదరపు గజాల్లో అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసిన గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కె. వెంకటేశ్వరరావు, కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ త్రినాథ్ రావు, మరియు మచిలీపట్నం జిల్లా రిజిస్ట్రార్ లపై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామానికి చెందిన మూల్పూరి వెంకటలక్ష్మి ఫిర్యాదు చేశారు.
• గుంటూరు జిల్లా కోర్టులో వైసీపీ సానుకూలంగా ఉన్న పీపీలు (పబ్లిక్ ప్రాస్యుకూట్), ఏపీపీలు, స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్లను అక్కడ నుండి మార్చాలని.. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్, టీడీపీ నాయకుడు హజీ హషన్ భాషాలు విజ్ఞప్తి చేశారు.
• అల్లూరి జిల్లా కు చెందిన ఓ మహిళ విజ్ఞప్తి చేస్తూ తన భర్త పాముకాటుకు గురై మరణించారని.. తనకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని.. తాను బీఏ బీఈడీ చదివానని తనకు ఉపాధి అవకాశం కల్పించాలని వేడుకోగా.. వెంటనే ఎమ్మెల్యే ఆ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి ఆమె పరిస్థితిని తెలియజేసి ఉద్యోగం కల్పించాలని ఎమ్మెల్యే కోరారు.
• గత కొన్ని సంవత్సరాల నుండి ఎంపీహెచ్‌ఏ(ఎం) హెల్త్ అసిస్టెంట్ మేల్ పోస్టులకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వడంలేదని.. జాతీయ ప్రమాణాల ఆధారంగా ప్రతి అయిదు వేల మందికి ఒక హెల్త్ అసిస్టెంట్ మేల్ ఉండాలని.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5000 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తి చేయాలని అన్ ఎంప్లాయి పారా మెడికల్ హెల్త్ అసిస్టెంట్ (మేల్) అసోసియేషన్ సభ్యులు గ్రీవెన్స్ అభ్యర్థించారు.
• ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అవుట్ సోర్సింగ్ నాట్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తూ… వారికి మినిమం టైం స్కేల్ వర్తింప చేయాలని.. అలాగే మేనిఫెస్టోలో ప్రకటించినట్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింప చేయాలని.. 62 ఏళ్ళ వరకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
• తాము టీడీపీకి సానుకూలంగా ఉన్నామని తమ షాపులను అక్రమంగా కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగోలనుకు చెందిన మాదాల శ్రీనివాసరావు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి విచారణ చేపట్టి నింధితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
• గన్నవరం మండలం ముస్తాబాద గ్రామంలో వెలసిన శ్రీ యనమందల సీతారామాంజనేయ స్వామి దేవస్థానానికి 200 ఏళ్ల చరిత్ర ఉందని.. ఈ పురాతన ఆలయ నిర్వహణ కోసం అప్పటి నూజివీడు జమిందర్ వంశీయులు 16 ఎకరాల వ్యవసాయ భూమిని విరాళంగా ఇచ్చారని నూజివీడు జమిందారులు సమకూర్చిన భూమితోనే దేవస్థానం నిర్వహణ జరిగేదని ఆ భూమి నేడు కబ్జాకు గురైందని.. కబ్జాదారుల నుండి ఆ భూమిని విడిపించాలని కంచర్ల ఈశ్వరరావు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు.
• అంబాపురం గ్రామ పంచాయతీలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అండతో తోడెటి బెంజెమెన్ మరికొంత మంది రౌడీ మూకలు ప్రభుత్వ స్థలాలను కబ్జాచేశారని… వారి ఫోర్జరీ దస్తావేజులను పరిశీలించి నిందితులపై చర్యలు తీసుకోవాలని అంబాపురం గ్రామ సర్పంచ్ సీతయ్య కోరారు.