అక్కచెల్లెమ్మలకు జగన్ రెడ్డి నమ్మక ద్రోహం

-చేయూత కాదు….జగన్ రెడ్డి చేతివాటం
-ఆర్థిక సాయం పేరుతో అక్కచెల్లెమ్మలను నమ్మకద్రోహం
-45ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ. 3 వేల హామీకి తూట్లు
– టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ

మాటల్లో నా అక్కచెల్లెమ్మలంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పే జగన్ రెడ్డి చేతల్లో వారిని నట్టేట ముంచుతున్నాడు. ఇవాళ అనకాపల్లి జిల్లాలో చేయూత పథకం 4వ విడత నిధుల విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలను ఉద్దరించినట్టు పచ్చి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటు.

ఎన్నికలకు ముందు చేయూత పథకం కింద 45 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ మహిళలకు రూ. 3 వేల చొప్పున పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక పెన్షన్ కాదు…ఐదేళ్లకు కలిపి రూ. 75,000 ఆర్థికసాయమని మడమ తిప్పారు. జగన్ రెడ్డి చేసిన మోసంతో ఒక్కో మహిళకు రూ. 1.05 లక్షల చొప్పున నష్టం జరిగింది. ఇది మహిళలను మోసం చేయడం కాదా జగన్ రెడ్డీ?

మహిళా సంక్షేమానికి ఈ ఐదేళ్లలో జగన్ రెడ్డి చేసింది శూన్యం. మహిళల ఆర్థిక స్వావలంబనకు చంద్రబాబు గారు అమలు చేసిన అనేక పథకాలను రద్దు చేసి తాను మహిళా ఉద్ధారకుడిగా మాట్లాడటం దుర్మార్గం. పిన్నమ్మ తాళి తెంచిన నరహంతకుల్ని రక్షిస్తున్న జగన్ రెడ్డి మహిళా ద్రోహి కాదా? చెల్లికి ఆస్తిలో భాగం ఇవ్వని జగన్ రెడ్డి మోసగాడు కాదా?

సొంత చెల్లిళ్లకే న్యాయం చేయలేని జగన్ రెడ్డి రాష్ట్రంలోని ఆడబిడ్డలను ఉద్దరిస్తాడా? జీతాలు పెంచమని వేడుకున్న అంగన్వాడీ, ఆశా వర్కర్లను పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం, ఏపీని అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చడం మహిళల పట్ల జగన్ రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనం. జగన్ రెడ్డి చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని మహిళలే గద్దె దించుతారు.