-ఈసారి వస్తే అవయవాలు కూడా అమ్మేస్తాడు
-నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు
-ఆర్‌ఎంపీ డాక్టర్లతో ఆత్మీయ సమావేశం
నరసరావుపేట, మహానాడు: సమాజం కోసం ఎంతగానో తపించే వృత్తుల్లో వైద్య వృత్తి ఒకటి. అలాంటి వృత్తి నుంచి వచ్చిన వాడిగా చెబుతున్నా నియోజకవర్గంలోని వైద్యులకు అండగా నిలిచే బాధ్యత తీసుకుం టానని ఎన్డీఏ కూటమి నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు నరసరావుపేట పట్టణంలోని కపిలవాయి విజయ్‌కుమార్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆర్‌ఎంపీ డాక్టర్ల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా చదలవాడతో పాటు లావు మేఘన, పట్టణంలోని ముఖ్య డాక్టర్లు హాజరయ్యారు. జగన్ రెడ్డి ధన దాహం కారణంగా రాష్ట్రంలో వేలాది మంది పేదలు కల్తీ మద్యంతో ప్రాణాలు కోల్పో తున్నారు. కిడ్నీ వ్యాధులతో మంచాన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మళ్లీ జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఈ సారి అవయవాలు కూడా అమ్ముకుంటాడేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి లాంటి దోపిడీదారుడిని రాష్ట్రం నుంచి తరిమేందుకు వైద్యులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఎంతో మంది నాయకులను చూశాం కానీ, ప్రజల ప్రాణాలను తీస్తూ అందులో కూడా కాసులు వెతుక్కునే వారిని ఎప్పుడూ చూడలేదన్నారు. వైద్యులు అంటేనే సమాజంపై ఎంతో సేవాభావం కలిగిన వారని, అలాంటి వైద్యులను కూడా వేధించి చంపిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అన్నారు. నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్, చిత్తూరులో డాక్టర్ అణితారాణి లాంటి వారిని వేధించిన విధానం అత్యంత బాధాకరమ న్నారు. ప్రజలంతా కూటమిని గెలిపించేందుకు సిద్ధమయ్యారన్నారు. సేవా భావం కలిగిన వ్యక్తులుగా మనం కూడా వారి సంకల్పానికి తోడుగా నిలుద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు.