జగన్ రెడ్డికి నిజం చెబితే తల ముక్కలవుతుంది

-జగన్ రెడ్డికి నిజం చెబితే తల ముక్కలవుతుంది
-బొత్స, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి భూములు, చెరువులు కబ్జా చేస్తున్నారు
-వైకాపా పేటీఎం కుక్కలు జగన్ రెడ్డి సొంత చెల్లి షర్మిలను సోషల్ మీడియాలో తిడుతున్నా పట్టించుకోవడం లేదు
-నేను పరదాల మాటున లేదు. దమ్ము, ధైర్యంతో ప్రజల్లో తిరుగుతున్నా
-రాజాం శంఖారావం సభలో యువనేత నారా లోకేష్

ఎన్నికేసులు పెట్టిన ఎత్తిన జెండా దించకుండా కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి నా పాదాభివందనాలు. ఉత్తరాంధ్ర ఉద్యమాల గడ్డ. మంచి చేసిన వారిని గుర్తించుకుంటారు. చెడు చేస్తే తాట తీస్తారు. విజయనగరం జిల్లాలోనే విజయం ఉంది. ఇక్కడ నుంచి ఏ పని చేసినా విజయమే.

ఉత్తరాంధ్రలో పైడితల్లి అమ్మవారు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు నడిచిన నేల ఈ ప్రాంతం. ముఖ్యమంత్రి జగన్ ఓ 420. ఆయనపై 420 కేసులు 28 ఉన్నాయి. ఆయన పక్కన సలహాదారు 840 సజ్జల రామకృష్ణారెడ్డి. ఇచ్చేవన్నీ పనికిమాలిన సలహాలు. ఇప్పటివరకు జీతాల పేరుతో 150 కోట్లు లాగేశాడు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ 3 స్థానాల్లో గెలిచింది. అప్పుడు సజ్జల వీళ్లు అసలు మా ఓటర్లే కాదన్నారు. అప్పుడు అర్థమైంది వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారు. సజ్జలకు రెండు ఓట్లు ఉన్నాయి. ఒకటి మంగళగిరి, మరొకటి పొన్నురులో. ముఖ్యమంత్రి సలహాదారుడే దొంగ ఓట్లు వేసే పరిస్థితి ఉంది. తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్లతో గెలిచారు. ఆరోజే చెప్పా దొంగ ఓట్లు చేర్పించే అధికారులపై చర్యల తప్పవని. ఇప్పుడేమైంది అక్రమాలకు పాల్పడిన ఓ ఐఏఎస్ ను, డీఎస్పీ, సీఐలను, ఎస్ఐలను ఈసీ సస్పెండ్ చేసింది.

రేపోమాపో మరికొందరిపై చర్యలు తీసుకుంటారు. ఎందుకు అధికారులు నా రెడ్ బుక్ లో ఎక్కాలనుకుంటారు? చట్టాన్ని ఉల్లంఘించే వారిని ఎవరినీ వదిలిపెట్టను. నీతి నిజాయతీలతో బతకాలి. నేను అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నమ్ముకుంటే జగన్ రెడ్డి రాజరెడ్డి రాజ్యాంగాన్ని నమ్ముకున్నారు. నేను జనంలో తిరిగే వ్యక్తిని అయితే జగన్ పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తి.

నేను స్టాన్ ఫోర్ట్ లో ఎంబీయే చదివితే జగన్ టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వ్యక్తి. నాకు క్లాస్ మేట్స్ ఉంటే జగన్ కు జైలుమేట్స్ ఉన్నారు. జగన్ కేబినెట్ కి కొత్త అవార్డు వచ్చింది. దేశంలోనే అతి చెత్త కేబినెట్. వారికి కేటాయించింది ఏ శాఖనో కూడా తెలియదు.

ఉదయం లేస్తే ఢిల్లీ చుట్టూ తిరిగే అప్పుల అప్పారావు మన ఆర్థికమంత్రి బుగ్గన. ఇసుక, గనులు మింగేసే గనుల శాఖ మంత్రి పాపాల పెద్దిరెడ్డి, నకిలీ మద్యం అమ్మడంతో పాటు కోర్టు ఫైళ్లు కొట్టేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి. పిల్ల కాలువలు తవ్వలేని వ్యక్తి అరగంట అంబటి రాంబాబు మన ఇరిగేషన్ శాఖ మంత్రి. సొంత ఊళ్లో ధాన్యం సంచులు ఇవ్వేలని ఎర్రిపప్ప మంత్రి, పౌర సరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. పిల్లలు బాగా చదవకపోవడం వల్లే ఉద్యోగాలు రాలేదన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.

విశాఖలో ఓ మంత్రి ఉన్నాడు. పరిశ్రమలు ఎప్పుడు తీసుకువస్తారంటే కోడి ముందు వచ్చిందా, గుడ్డు వచ్చిందా అని సొల్లు కబుర్లు చెప్పే పరిశ్రమల శాఖ మంత్రి కోడిగుడ్డు అమర్ నాథ్. ఎంత అద్భుతమైన కేబినెట్.

జగన్ రెడ్డి కొత్త పథకం తీసుకువచ్చారు. అదే స్విమ్మింగ్ ఫూల్ పథకం. మా సీఎంకు ముందు చూపు వల్లే ప్రతి గ్రామంలో, పట్టణంలో స్విమ్మింగ్ ఫూల్స్ ఏర్పాటుచేస్తున్నారని అంటున్నారు. అవి గోతులు కాదు.. స్విమ్మింగ్ ఫూల్స్. వర్షం పడితే మనం ఈత కొట్టే పరిస్థితి.

మా నమ్మకం నువ్వే జగన్ అని బోర్డులు పెడుతున్నారు. సొంత తల్లి, చెల్లినే నమ్మడం లేదు.. ఎన్నికల ముందు వారిని గ్రామాల్లో తిప్పించి, ఎన్నికల తర్వాత గెంటేశారు. సొంత తల్లి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకు న్యాయం చేస్తాడా అని మహిళలను అడుగుతున్నా. వైకాపా పేటీఎం కుక్కలు జగన్ రెడ్డి సొంత చెల్లి షర్మిలను సోషల్ మీడియాలో తిడుతున్నా పట్టించుకోవడం లేదు.

జగన్ రెడ్డి కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్. బల్ల పైన బులుగు బటన్ నొక్కి అకౌంట్ లో రూ.10 వేసి, బల్ల కింద ఉన్న రెడ్ బటన్ తో వంద లాగేస్తున్నారు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాదుడే బాదుడే. ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్ తో లిక్కర్ రేట్లు పెంచారు. గాలిపైనా పన్నువేసే వ్యక్తి జగన్. అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుకలు, విదేశీ విద్య, పండుగ కానుకలు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్ మెంట్, పెన్షన్ లు కట్, రైతులకు రావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్.. ఇలా దేశంలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్.

అందుకే ప్రజలు పడుతున్న కష్టాలు చూసి చంద్రబాబు-పవన్ కలిసి సూపర్ -6 హామీలు ప్రకటించారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేం తీసుకుంటాం. ప్రతి ఏడాది డీఎస్సీ భర్తీ చేస్తాం. ప్రతి ఏడాది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాం. జీవో 3 పునరుద్ధరించి గిరిజనులకే ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం రాని వారికి అప్పటివరకు 3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం.

స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తాం, ఇద్దరుంటే రూ.30వేలు, ముగ్గురుంటే ఏడాదికి రూ.45 వేలు మన ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తాం. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతోంది మన ప్రభుత్వం. 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇస్తాం, ఏడాదికి రూ.18వేలు, ఐదేళ్లలో రూ.90 వేలు ఇచ్చి ఆదుకునే బాధ్యత టీడీపీ-జనసేన తీసుకుంటుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.

ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ రెడ్డి. మూడు రాజధానులు అని ఒక్క ఇటుక కూడా వేయలేదు. ఉత్తరాంధ్రలో మూడు కుటుంబాలకు జగన్ లైసెన్స్ ఇచ్చారు. బొత్స, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి భూములు, చెరువులు కబ్జా చేస్తున్నారు. పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. ఆనాడు పెద్దవాళ్లు విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని నినదించి స్టీల్ ప్లాంట్ సాధించారు. దీనిని ప్రైవేటీకరించేందుకు జగన్ కుట్ర పన్నారు. మనం అధికారంలోకి వచ్చాక అవసరమైతే ఆ ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇస్తున్నా.

విజయనగరం జిల్లాకు జగన్ 50 హామీలు ఇచ్చారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తిచేస్తామన్నారు, చేశారా? రామతీర్థం ప్రాజెక్టు పూర్తిచేస్తామని గాలికొదిలేశారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తిచేయలేదు. గోస్తనీ-చంపావతి నదుల అనుసంధానం చేయలేదు. రామభద్రాపురం, పెద్దగడ్డ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని చెప్పి పట్టించుకోలేదు. సాలూరు బై పాస్ రోడ్డు, పాలేరు నదిపై డ్యామ్ నిర్మాణం, స్వర్ణముఖి-చిట్టిగడ్డపై బ్రిడ్జిపై నిర్మిస్తామన్నారు. ఏమైనా చేశారా?

జగన్ రెడ్డికి నిజం చెబితే తల ముక్కలవుతుంది. అందుకే ఊరికో అబద్ధం చెప్పారు. అసలు విజయనగరం జిల్లాను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. రోడ్లు, బ్రిడ్జిలు, భోగాపురానికి భూసేకరణ, సాగునీటి ప్రాజెక్టులు, పక్కా గృహాలు నిర్మించింది తెలుగుదేశం. రాజాంను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. గతంలోనే పాతవలస ప్రాజెక్టును పూర్తిచేశాం. రాజాంలో టీడీపీని గెలిపిస్తే పిల్లకాలువలు తవ్వి ప్రతి ఎకరాకు నీరు ఇస్తాం. గతంలోనే తాగునీరు అందించాం, ఇంకా అందించాల్సి ఉంది. అది కూడా చేస్తాం.

గతంలోనే ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మేం చేశాం. మహిళల జూనియర్ కళాశాల, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, రెసిడెన్షియల్ కాలేజ్, ఐటీఐ, రైతు బజార్, నేను మంత్రిగా ఉన్నప్పుడు నిధులు కేటాయించి సీసీ రోడ్లు వేశాం. అయినా ఏం జరిగింది? 2019లో కంబాల జోగులు గారిని గెలిపించారు. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. గత పదేళ్లలో మీ జీవితాల్లో ఏమైనా మార్పులు వచ్చాయా?

రాజాంలో ఎమ్మెల్యే కంబాలు జోగులును గెలిపిస్తే బంపర్ ఆఫర్ వచ్చింది. మీకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ పని జరగాలన్నా ముగ్గురి దగ్గరకు వెళ్లి కప్పం కట్టాలి. ఓ పక్క ఎమ్మెల్యే, మరోపక్క ఎమ్మెల్సీ విక్రాంత్, ఇంకో పక్క చిన్న శ్రీను.
వీరంతా కలిసి పెద్దఎత్తున ఇసుక దోపిడీ చేస్తున్నారు. పక్కనే నాగావళి నది ఉన్నా నేడు ట్రాక్టర్ ఇసుక రూ.5వేలు అయిందంటే వీరు ముగ్గురే కారణం. రైతులు ధాన్యం కొనుగోళ్లలో కూడా పెద్దఎత్తున దోపిడీ చేశారు.

జిల్లాల్లో పంచాయతీ రాజ్ జేఈ రామకృష్ణ ఆత్మహత్యకు కారణం వైకాపానే. ఆయనను బెదిరించి ఇసుక, ఇనుము లాక్కున్నారు. తిరిగి ఆయన్నే డబ్బులు కట్టమంటే, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. 2024లో టీడీపీ-జనసేన బలపరిచిన వ్యక్తిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం.

పద్ధతి ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తాం, తోటపల్లి ప్రాజెక్టుకు అవసరమైన పిల్ల కాలువలు కూడా తవ్వుతాం. రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో నాకు తెలుసు. మనం అధికారంలోకి వస్తే మొదటి వంద రోజుల్లో రోడ్లు వేసే బాధ్యత నేను తీసుకుంటా. విజయనగరం-పాలకొండ-రాజాం మార్గంలో 4 లైన్ రోడ్లు వేస్తాం. పట్టణానికి భూగర్భ డ్రైనేజీ నిర్మిస్తాం. రింగ్ రోడ్డు కూడా ఏర్పాటుచేసే బాధ్యత మాది. బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుతో పాటు ప్రతి ఇంటికి ఉచిత మంచినీటి వసతి కల్పిస్తాం.

గతంలో 2500 టిడ్కో ఇళ్లు కట్టిస్తే ఇప్పడు విస్మరించారు. అవసరమైతే పాతవాటితోపాటు మళ్లీ టిడ్కో ఇళ్లు కట్టించి పేద ప్రజలకు ఇస్తాం. చంద్రబాబును ఆనాడు అక్రమంగా రిమాండ్ కు పంపిస్తే నాకు మొదట ఫోన్ చేసింది పవనన్న. మీకు అండగా నిలబడతానని, ఏం కావాలన్నా ఒక్క ఫోన్ చాలని చెప్పారు.

చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు పవన్ రాష్ట్రానికి వస్తుంటే ఆయన విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేసిందీ అరాచక ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలని ప్రయత్నిస్తే ఏపీ బోర్డర్ లో 3గంటలు ఆపేశారు. అందుకే సైకో జగన్ ను తరిమికొట్టాలని చంద్రబాబు-పవన్ నిర్ణయించుకున్నారు.

టీడీపీ కార్యకర్తల పార్టీ. నాకు అక్కా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లు లేకపోయినా 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. 2014లో కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటుచేసి వంద కోట్లు ఖర్చు చేయడం జరిగింది. చనిపోయిన కార్యకర్తల కుటుంబాల పిల్లలను మా తల్లి భువనేశ్వరి దత్తత తీసుకుని చదివిస్తున్నారు.

కార్యకర్తలకు క్యాన్సర్ వచ్చినా, ఏమైనా వ్యాధులు వచ్చినా మేం ఆదుకుంటున్నాం. మనపై దొంగ కేసులు పెట్టారు. నాపై 22 కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. అయినా తగ్గేదే లేదు. బాంబులకు భయపడలేదు, చిల్లరకేసులకు భయపడతామా? భయం మన బయోడేటాలోనే లేదు.

అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు రాముడు, కానీ వైకాపా నాయకులకు లోకేష్ మూర్ఖుడు. ఏ అధికారి అయితే చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయి. రెండు నెలలు ఓపిక పట్టండి. వారిపై జ్యుడీషియరీ ఎంక్వై్రీ వేసి జైలుకు పంపే బాధ్యత నేను తీసుకుంటా.

రెడ్ బుక్ పై కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోర్టుకువెళ్లారు. తప్పు చేయని వారు ఎందుకు భయపడాలి? అయినా వారెంట్ ఎందుకు.. రాజాంలో ఉన్నా.. వచ్చి అరెస్ట్ చేయండి. నేను పరదాల మాటున లేదు. దమ్ము, ధైర్యంతో ప్రజల్లో తిరుగుతున్నా.

జగన్ టైం, డేట్ చెబితే నీ అవినీతి, మా చిత్తశుద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసురుతున్నా. కార్యకర్తలందరూ ప్రతి గడపకు వెళ్లి సూపర్-6 కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలి. టీడీపీ కార్యక్రమాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తాం.