తప్పుడు కేసులతో ప్రతిపక్ష నేతల్ని వేధించారు
సౌమ్యంగా ఉండే డా౹౹చదలవాడపైనా 17 కేసులు
శ్వేతపత్రం విడుదల సమయంలో ప్రస్తావన
నరసరావుపేట, మహానాడు : ప్రజా సమస్యలపై పోరాడుతూ, అత్యంత సౌమ్యుడైన నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబుపై కూడా గత ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి వేధించిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 2019-24 మధ్య కాలంలో రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేశారు.అనంతరం ప్రజా సమస్యలపై నిలదీసే నాయకులపై తప్పుడు కేసులు పెట్టిన ఘనత జగన్ రెడ్డికే దక్కిందన్నారు.
నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అరాచకాలను ప్రశ్నించినందుకే కేసులు నమోదు చేశారన్నారు. ప్రజల గురించి ఆలోచించడమే నేరం అనేలా గత ఐదు సంవత్సరాలు నియోజకవర్గంలో గోపిరెడ్డి వ్యవహరించినట్లు పేర్కొన్నారు. డా౹౹చదలవాడ అరవింద బాబుపై నమోదు చేసిన కేసుల గురించి చట్ట సభల్లో ముఖ్యమంత్రి ప్రస్తావించడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.గోపిరెడ్డి లాంటి అరాచక శక్తి ఎంతగా పేట్రేగిపోయినా ప్రజల కోసం నిరంతరమూ పోరాటం చేస్తానని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు.