– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
వినుకొండ, మహానాడు: దొంగ యాత్రలతో చేసిన పాపాలు పోవు జగన్ రెడ్డి… పాపాలన్నీ చేసి యాత్రలు, దర్శనాలు చేసుకుంటే ప్రాయశ్చితం పోతుందా అని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే.. జగన్ చేసింది మాములు పాపం కాదు.. కలియుగ వైకుంఠస్వామికే ద్రోహం చేశారు. జగన్ పాలనలో తిరుమల ఆలయంలో చేయకూడని అపచారాలన్నీ చేశారు. దేవుడంటే నమ్మకం లేని నాస్తికులు, అన్యమతస్తులు, దొంగల చేతుల్లో పాలకమండలిని పెట్టారు. ఇప్పటికైనా జగన్‌రెడ్డి చేయాల్సింది యాత్రలు కాదు, తప్పు ఒప్పుకోవడం.
అయిదేళ్లుగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని తిరుమలలో దోపిడీ చేశారు. తిరుమల వెళ్తే ఈసారైనా డిక్లరేషన్‌పై సంతకం చేయడం మరిచిపోకండి జగన్. ఈ నెల నాలుగో తేదీ నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు తిరుమలలో అలజడి సృష్టించాలని జగన్ కుట్రలు. బ్రహ్మోత్సవాల సమయంలో కుట్రలు చేస్తున్నట్లు నిఘావర్గాలకు సమాచారం. జగన్ యాత్ర, ఆలయాల్లో పూజలకు పిలుపునివ్వడం ఆ అనుమనాలకు మరిత బలం చేకూర్చుతోంది. జగన్ అండ్ బ్యాచ్ చేసిన పాపాలకు ఇప్పటికే ఒకసారి తిరుమల సంప్రోక్షణ. ఇప్పుడు మళ్లీ జగన్ పోతే మరోసారి సంప్రోక్షణ చేయాల్సి వస్తుంది.