– ఆ తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి
– అధికారం పోవడంతో మాజీ సీఎంకు మతి చలించింది..
– మళ్లీ అధికారం కోసం గడ్డి కరుస్తున్నారు
– జగన్ రెడ్డి హైందవుడా? క్రైస్తవుడా అనేది పెద్ద వాదన
– కూటమిలోకి వస్తున్న క్వచ్ఛనబుల్ నేతలను
మూడు పార్టీలు చర్చించుకుని చేర్చుకునేలా అధినేత దృష్టికి తీసుకెళ్తాం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
ఒంగోలు, మహానాడు: జగన్ కు పదవి పోయేసరికి మతి చలించింది. ఇంతటి పరాభవాన్ని జగన్ ఊహించలేదు. జగన్ రెడ్డి మళ్లీ తన అధికారం దక్కించుకోవడానికి నానా కుప్పిగంతులు వేస్తున్నారు. పడరాని పాట్లు పడుతూ.. నానా గడ్డి కరుస్తున్నారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) వర్ల రామయ్య అన్నారు. ఒంగోలు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో ఏమన్నారంటే…
జగన్ రెడ్డి హయాంలో టీటీడీ లడ్డూ కల్తీ జరిగిందని సాక్ష్యాధారాలతో బయట పడింది. దాన్ని కూడా జగన్ రెడ్డి రాజకీయం చేయాలనుకుంటున్నారు. జగన్ కు తెలియకుండానే తాను అపచారం చేస్తారు. అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నారు. జగన్ ఏమో సీబీఐ ఎంక్వైరీ వేయమని అడుగుతారు.. వైవీ సుబ్బారెడ్డేమో తనపై సీబీఐ ఎంక్వైరీ వద్దంటారు. ఇప్పటికైనా సిగ్గుతెచ్చుకుని దొంగకు తేలుకుట్టినట్టుగా ఉండాల్సిందిపోయి కుప్పిగంతులు వేస్తున్నారు. మీ పాపాలను కడిగేందుకు సంప్రోక్షణ చేస్తుంటే.. మళ్లీ మీరు తిరుమలకు వెళ్లి ఎందుకు అప విత్రం చేస్తారు? ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న మీర స్వామివారి దేవాలయంలోకి వెళితే అపవిత్రం అవ్వక ఏమి అవుతుంది.
స్వామివారిపట్ల ఏనాడైనా భక్తి భావంతో వ్యవహరించారా? శ్రీవారి పట్ల ఏనాడైనా విశ్వాసం వ్యక్తం చేశారా? ఎవరైనా తిరుమలకు వెళితే గోవింధుడి పట్ల పూర్తి విశ్వాసంతో వెళ్తారు. కాని జగన్ ఆ విశ్వాసం లేదు. పైగా జగన్ రెడ్డి హైందవుడా? క్రైస్తవుడా అనేది పెద్ద వాదన వినిపిస్తోంది. దానికి కూడా జగన్ రెడ్డి ఏనాడు క్లారిటీ ఇవ్వలేదు. విజయమ్మ, వైఎస్ భారతిలు బైబిల్ పట్టుకుని తిరుగుతుంటారు. మేం దేన్ని రాజకీయం చేయాలనుకోవడం లేదు. రాబోయే రోజులు కూడా మావే. ప్రపంచ వ్యాప్తంగా స్వామివారికి భక్తులు ఉన్నారు. దివంగత నందమూరి రామారావు హయాంలో టీటీడీని వాటికన్ సిటీలా స్వయం ప్రతిపత్తితో అభివృద్ధి చెందేలా చూడాలని ప్రయత్నించారు.. చంద్రబాబు కూడా దాని పవిత్రతను కాపాడుకుంటూ వచ్చారు.
జగన్ రెడ్డి టీటీడీ పవిత్రతను కాపాడటంలో ఘోరంగా విఫలం అయ్యారు. ధర్మారెడ్డికి ఈవోగా పనిచేసే హక్కు ఉందా.. గత ఐదు సంవత్సరాలు తిరుమల వైసీపీ అసాంఘిక శక్తులకు అడ్డగా మారింది. నాస్థికుడునని చెప్పుకునే భూమన కరుణాకర్ రెడ్డి, క్రైస్తవం పాటించే ఆయన… వెంకన్న టెంపుల్ కు సంబంధం ఏంటి? వారు వెంకన్న దర్శనానికి వెళ్లడాన్ని మేం తప్పు పట్టడంలేదు. డిక్లరేషన్ ఇచ్చి వెళితే ఎవరూ అభ్యంతరం తెలపరు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి… నేడు శాసన సభ్యులుగా ఉన్న వ్యక్తి ఎందుకు చట్టాన్ని దిక్కరించేలా వ్యవహరిస్తున్నారు.
హైందవ మతాచారాలను కించపరచాలనే ఉద్దేశం ఏమైనా ఉందా? అని వర్ల రామయ్య వైసీపీ నేతలను ప్రశ్నించారు. వైసీపీ నేతల వలన భక్తుల భావాలు దెబ్బ తిన్నాయి కనుక జగన్ రెడ్డి తిరుమలకు వెళితే అక్కడ ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు అయ్యాక వెళితే మేలు. సోనియాగాంధి లాంటి నాయకులు స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడు సైన్ చేసి వెళ్లారు. అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తి స్వామి వారిపట్ల విశ్వాసం ప్రకటించి సతకం చేసి దర్శించుకున్నారు. జగన్ తిరుమలకు వెళ్తానంటే స్వామివారిపట్ల విశ్వాసం ఉందని సంతకం చేసి వెళ్లాలి.
ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. సిట్ వేస్తే వైసీపీ నేతలు ఎందుకు కంగారు పడుతున్నారన్నారు. ఎంక్వైరీ వద్దని సుబ్బారెడ్డే ఎందుకు గగ్గోలు పెడుతున్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన 10 మంది కూడా వైసీపీలో ఉంటారన్న నమ్మకంలేదు. క్వచ్ఛన్ బుల్ క్యారెక్టర్ కలిగిన వ్యక్తులు పార్టీల్లో చేరేముందు మూడు పార్టీల నేతలు చర్చించుకుని అధినేత దృష్టికి తీసుకెళ్లి చేర్చుకునే విధంగా చర్చిస్తున్నామని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు వర్ల రామయ్య సమాధానం ఇచ్చారు.