ఎక్కడా లేని వింత బ్రాండ్లు ఇక్కడే ఉన్నాయి…
అందుకేనా మీకు అధికారం ఇచ్చింది
దెందులూరు సభలో వై.ఎస్.షర్మిలారెడ్డి
దెందులూరు, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం దెందులూరులో జరిగిన భారీ బహిరంగ సభలో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ప్రసంగించారు. పోలవరం వైఎస్ కల. ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు వచ్చేది. పోలవరం పూర్తి చేస్తావని జగన్ హామీ ఇచ్చాడు. చివరికి మనం కట్టే ప్రాజెక్ట్ కాదని చేతులు ఎత్తేశాడు. వైఎస్ వారసు డు అయితే ఇలానే చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఎన్నో పరిశ్రమ లు వచ్చేవి. బాబు, జగన్ ఇద్దరూ రాష్ట్రాన్ని మోసం చేశారు. బీజేపీకి గులాం గిరీ చేస్తున్నారు. మనకు మిగిలింది చేతిలో చిప్ప. జాబ్ క్యాలెండర్‌కు దిక్కులేదు.2.35 లక్షల ఉద్యోగాలు భర్తీ అన్నాడు..మెగా డీఎస్సీ అని మోసం చేశాడు. ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఇవి వచ్చేవా? సచ్చేవా? అని ప్రశ్నించారు. అప్పులేని రైతు రాష్ట్రంలో లేడు… ఎక్కడ చూసినా ఆత్మహత్యలే..పంట నష్ట పరిహారం లేదు..ధరల స్థిరీకరణ నిధికి దిక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యం బ్రాండ్లకు వింత పేర్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని మద్యం పేర్లు ఉన్నాయి. నాసిరకం మందు తాగి 25 శాతం ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి. ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది అని ప్రశ్నించారు. దెందు లూరు ఎమ్మెల్యే పేకాట, కోడిపందాలు అట..మూడు పువ్వులు..ఆరుకాయలుగా అన్నట్లు ఉంది. నియోజకవర్గంలో మట్టి మొత్తం దోచేశాడు. కొల్లేరు సమస్యను పట్టించుకోలేదు. ఆయన అవసరమా? ఆలోచించాలి. కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
ట్రాఫిక్‌లో చిక్కుకున్న షర్మిల కాన్వాయ్…పోలీసులపై ఆగ్రహం
షర్మిల సభ అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేయడంలో పోలీసులు చేతులు ఎత్తేశారు. గంటకు పైగా ట్రాఫిక్‌లో షర్మిలారెడ్డి కాన్వాయ్ చిక్కుకుంది. కనుచూపు మేరలో పోలీసులు ఎవరు లేక పోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీకి ఫోన్ చేసినా ఎత్తకపోవటంతో అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై కలెక్టరుకు ఫిర్యాదు చేశారు.