తెదేపా జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య
గుంటూరు, మహానాడు:
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిన్నమెదడు చితికిపోయిందని తెదేపా జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి వచ్చి కనీస వివరణ ఇవ్వకుండా ఢిల్లీలో చిత్ర విచిత్ర విన్యాసాలు చేశారన్నారు. శ్వేతపత్రం గురించి మాట్లాడమంటే శ్వేత ఎవ్వరు అని అడిగే రకాలు తయారయ్యారన్నారు. శాంతిభద్రతలని గగ్గోలు పెడుతుంటే శాంతికి భద్రత కల్పించే పనిలో వైకాపా నేతలు ఉన్నారన్నారు.
క్రైమ్ కి, గంజాయికి క్యాపిటల్ గా మార్చిన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టే కృషి చేస్తున్నామన్నారు. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది. అసెంబ్లీకి రావాలి జగన్ కావాలి జగన్ అన్నదే మా నినాదం. కేసులు ఎంతమంది మీద ఉన్నాయని అడిగితే నిలబడిన ఎమ్మెల్యేల కళ్లన్నీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ రాక కోసం వేచి చూస్తున్నాయని ఎద్దేవా చేశారు.