-ప్రజల పొలాల్లో పునాది రాళ్లపై ఆయన ఫొటోలా?
-ల్యాండ్ టైటిలింగ్ పేరుతో భూముల కబ్జాకు కుట్ర
-పెదనందిపాడు మండల పర్యటనలో పెమ్మసాని
గుంటూరు, మహానాడు : ‘ల్యాండ్ టైటిలింగ్ పేరుతో ప్రజల పొలాల్లో పునాది రాళ్లపైన జగన్ ఫొటోలను అతికించు కున్నారు. ఎవరి ఆస్తుల్లో ఎవరి ఫొటోలు అతికించుకుంటారు…ఇదేనా ప్రజా సంక్షేమం?’ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలో శుక్రవారం ఆయన అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పర్యటనలో భాగంగా నాగభైరవపాలెం, జరుగువారిపాలెం, ఉప్పలపాడు, పరిటాలవారిపాలెం, అన్నవరం, రాజు పాలెం, పాలపర్రు, అభినయని గుంట పాలెం, గిరిజవోలు గుంట పాలెం, గోగులమూడి, కాట్రపాడు, కుసులూరు గ్రామాల్లో సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మాట్లాడుతూ గ్రామాల్లోకి రాకపోకలు సాగించే రహదారులు ఇబ్బందికరం గా మారాయని, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రజల వినతులు సావధానంగా విన్న తర్వాత పెమ్మసాని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల సహకారంతో వచ్చిన జలజీవన్ మిషన్ నిధులను ఈ జగన్ కేవలం కడపకు మాత్రమే తరలించుకున్నారని విమ ర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే నివాసాలకు కొళాయి కనెక్షన్లు వచ్చేలా కృషి చేస్తామ ని, నకిలీ విత్తనాలు ఎరువులు మార్కెట్లోకి రాకుండా అరికడతామని తెలిపారు. రైతుల ప్రోత్సా హకాల నిమిత్తం పసుపు, మిర్చి, టొమాటో ఇతర పంటల అభివృద్ధికి సహకరిస్తామని భరోసా ఇచ్చారు. సీఎస్ఆర్ రాజ్యసభ నిధులతో అభివృద్ధికి పునాది వేస్తానని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు సులభతరమయ్యేలా స్కిల్ డెవలప్మెంట్కు, అవసరమైతే సొంత ఖర్చులతో అందిస్తానని స్పష్టం చేశారు.
బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ పర్యటనలో భాగంగా ప్రతి గ్రామాన ఉన్న సమస్యలను గుర్తించామని చెప్పారు. ఈ గ్రామాల్లో వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ మాట్లాడుతూ వైసీపీ అరాచకాలతో విసుగు చెంది ప్రజలు టీడీపీ వైపు చూస్తున్నారన్నారు. జగన్ విధ్వంస పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, ముస్లిం నాయకులు సయ్యద్ ముజీబ్, ఉగ్గిరాల సీతారామయ్య, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.