Mahanaadu-Logo-PNG-Large

అబద్ధాలతో మళ్లీ జగన్‌ మోసం

చిత్తు చిత్తుగా ఓడిరచడం ఖాయం
పల్నాడు టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్‌

నరసరావుపేట, మహానాడు : నరసరావుపేట టీడీపీ పార్లమెంట్‌ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్‌ విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఐదేళ్ల క్రితం జగన్‌ ఏ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడో ఇప్పుడు కూడా అవే అబద్ధాలు చెబుతున్నాడు. ఇచ్చిన హామీ లను నెరవేర్చలేదు. రాష్ట్రంలో ప్రజలను అరాచకాలతో ఇబ్బందులు పెట్టారు. బటన్‌ నొక్కుడు అంటూ వైసీపీ ప్రభుత్వం దోపిడీ వ్యవస్థలను తీసుకువచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాయి. ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమయ్యారు..చదువుకున్న వాళ్లు పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. రైతాంగానికి చిత్తశుద్దితో నీళ్లు కూడా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడిరచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు…కూటమి అధికారం చేపట్టడం ఖాయమని స్పష్టం చేశారు.