దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి
దర్శి, మహానాడు : మరోసారి మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేయలేవు ..మద్య నిషేధం చేయకుండా ఎలా ఓట్లు అడుగుతావని కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ శనివారం విడుదల చేసిన మేనిఫెస్టోపై ఆమె స్పందించారు. 2019 ఎన్నికల్లో మేనిఫెస్టో అంటే ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పి హామీలు అమలుచేయలేదు. ఇప్పుడు నువ్వు పాత పథకాలను చూపిస్తూ తిరిగి మేనిఫెస్టో పేరుతో 2024లో ప్రజలను మోసం చేయాలను కుంటే నమ్మేస్థితిలో లేరన్నారు. వచ్చేది కూటమి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.