జగన్‌ మేనిఫెస్టో అట్టర్‌ ఫ్లాప్‌..చెత్త కుప్పలో వేస్తున్నారు

ప్రజా ఆకాంక్షలు నెరవెర్చే కూటమి మేనిఫెస్టో సూపర్‌ హిట్‌
బాబు ష్యూరిటీకి మోదీ గ్యారంటీ తోడుతో అభివృద్ధి
కేంద్రం సంపూర్ణ సహకారం ఉంటుంది
నైపుణ్య గణనతో కంపెనీల నుంచి పెట్టుబడుల ఆకర్షణ
ఆరోగ్య శ్రీ పేరుతో జగన్‌ దగా చేస్తున్నారు…
కూటమి నేతలు కొమ్మారెడ్డి, లంకా దినకర్‌, శివశంకర్‌

మంగళగిరి, మహానాడు : టీడీపీ అధినేత విడుదల చేసిన కూటమి మేనిఫెస్టోపై మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం కూటమి నేతలు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ దృష్టికి వచ్చిన సమస్యలు, ప్రజాగళంలో చంద్రబాబు దృష్టికి వచ్చిన అంశాలు, జనవాణిలో వచ్చిన వినతులు, ప్రజల వద్ద నుంచి నేరుగా వాట్సాప్‌ నెం బర్‌తో స్వీకరించిన లక్షా 30 వేల వినతుల ఆకాంక్షల నుంచి ఈ ప్రజా మేనిఫెస్టో ప్రజాగళంను రూపొందిం చాం. అన్ని వర్గాల ప్రజల ఆశలకు అనుగుణంగా కూటమి మేనిఫెస్టో ఉంది. మేనిఫెస్టోను ఏ విధంగా అమలుచేస్తారు. అది అమలు చేయడం అసాధ్యమని జగన్‌ రెడ్డి అబద్ధాలు చెబుతు న్నాడు. జగన్‌ రెడ్డికి అసలు పరిపాలనే చేతకాదు. ఆదాయం పెంచడం రాదు. సంపద సృష్టించడం జగన్‌ రెడ్డి డీఎన్‌ఏలోనే లేదు. చంద్రబాబుకు పెట్టుబడులు తీసుకురావడం తెలుసు. రాష్ట్రానికి ఆదాయం తీసుకురావడం తెలుసు. జగన్‌ రెడ్డి ఐదేళ్లలో రూ.8 లక్షల కోట్ల అవినీతి చేశాడు. లిక్కర్‌లో లక్షా 5 వేల కోట్లు, భూముల్లో లక్ష కోట్లు, సోలార్‌ పార్కు భూపందేరంలో రూ.75 వేల కోట్లు, టీడీఆర్‌ బాండ్లు ఇలాంటి దందాలను అరికడితే సరిపో తుంది. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చు. జగన్‌ మేనిఫెస్టో అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. దాన్ని చిత్తుకా గితంలా జనం చెత్త బుట్టలో వేస్తున్నారు. ప్రజాగళం మేనిఫెస్టోను నూటికి నూరు శాతం అమలు చేస్తాం. ఖురాన్‌, బైబిల్‌, భగవద్గీత అని చెప్పి మేనిఫెస్టో అమలులో వైసీపీ 85 శాతం విఫలమైంది.

ఆరోగ్య శ్రీ పేరుతో దగా…అందుకే యూనివర్సల్‌ హెల్త్‌ స్కీమ్‌ తెస్తున్నాం
ఆరోగ్య శ్రీ పేరుతో వైసీపీ దగా చేసింది. దాదాపు రెండు వేల కోట్లు ఆసుపత్రులకు చెల్లించలేదు. దాంతో ఆసుపత్రులు వైద్యం చేయలేమని బోర్డులు తిప్పేశాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రతిదీ వ్యాపారమే. బ్లాక్‌లో ఇంజ క్షన్లు అమ్ముకున్నారు..బెడ్లు అమ్ముకున్నారు..ఆక్సిజన్‌ సిలిండర్లు అమ్ముకున్నారు. ఆసుపత్రులను కూడా వ్యాపార కేంద్రాలుగా మార్చి పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేశారు. అందుకే చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి పక్షాన మూడు పార్టీలు కలిసి అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా యూనివర్సల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ను తీసుకు వచ్చారు. దేశంలోనే మొదటిసారి మన రాష్ట్రంలో తీసుకువచ్చారు. డిజిటల్‌ హెల్త్‌ కార్డులు తీసుకువస్తాం. ప్రతి పౌరుడికి అందిస్తాం. ఆ కార్డు జేబులో ఉంటే చాలు. ఆ కార్డుతో ఏ ఆసుపత్రిలో అయినా చికిత్స పొందవచ్చు. 25 లక్షల వరకు వైద్యం ఉచితంగా పొందవచ్చు. ప్రపంచంలో ఎక్కడా చేయని విధంగా స్కిల్‌ సెన్సెస్‌ (నైపుణ్య గణన)ను చేపడతాం. దీంతో ఎవరి దగ్గర ఏ నైపుణ్యం ఉందో తెలుస్తుంది. ఆ డేటాతో ఇన్వెస్టర్లను ఆకర్షించ వచ్చు. అవసరమైన వారికి ఏ నైపుణ్యం కావాలో దాన్ని అందించడం జరుగుతుంది. స్కిల్‌ సెన్సెస్‌తో స్కిల్‌ సెంటర్లను ఓపెన్‌ చేసి అర్హులందరికీ నైపుణ్య శిక్షణ అందిస్తాం.

యువతను దగా చేశాడు..
అన్ని స్కామ్‌లు అయిపోయి ఏపీపీఎస్సీలో ఉద్యోగాలను కూడా జగన్‌ రెడ్డి అమ్ముకున్నాడు. రాష్ట్రంలో ఉన్న యువతను దగా చేశాడు. యువతను ఆదుకునేందుకు నేడు చంద్రబాబు మెగా డీఎస్సీపై మొదటి సంతకం పెడతానిని ప్రకటించాడు. పేదల భూములు కొట్టేందుకు తీసుకు వచ్చిన జగన్‌రెడ్డి ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ రద్దు చేయడానికి రెండో సంతకం పెడతానని చంద్రబాబు ప్రకటించాడు. టీడీపీ పాలనలో రివర్స్‌ పీఆర్సీలు ఉండవు. నిస్వార్థంగా ప్రజలకు సేవచేసిన ఏ వాలంటీర్‌ మాకు వ్యతిరేకం కాదు. వారి జీతాలు కూడా పెంచు తాం. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు పేదలకు ఇంటి స్థలాలు ఇస్తున్నాం. ముస్లింలను ఆదుకుంటాం. రైతులకు ఆదాయం పెంచుతాం. రైతు కూలీల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తున్నాం. కార్మికుల సంక్షేమం కోసం దేశంలో మొదటిసారి డ్రైవర్‌ సాధికార సంస్థను కూటమి ఏర్పాటు చేస్తుంది. ధరలు నియంత్రించి గ్రీన్‌ ట్యాక్స్‌ను తగ్గిస్తాం. భవన నిర్మాణ బోర్డును పునరు ద్ధరిస్తాం. డొక్కా సీత మ్మ స్పూర్తితో అన్నా క్యాంటీన్‌లను ఏర్పాటు చేస్తాం. 100 రోజుల్లో కఠినచర్యలు తీసుకుని గంజాయి మాఫియాను అరికడతాం. మత సామరస్యాన్ని కూటమి కాపాడుతుంది. న్యాయవాదులు, మీడియా ప్రతినిధుల కు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుంది. రాష్ట్రంలో స్వేచ్చాయుత వాతావరణం కల్పిస్తాం.

జగన్‌ గ్యాంగ్‌ చిల్లర రాజకీయాలు
బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్‌ మాట్లాడుతూ బీజేపీ మేనిఫెస్టో ప్రజల జాతీయ ఆకాంక్షలను సూచిస్తే.. టీడీపీ, జనసేన పార్టీల మేనిఫెస్టో ప్రాంతీయ ప్రజల ఆకాంక్షలను సూచిస్తుంది. బీజేపీ జాతీయ శక్తి, టీడీపీ, జనసేన ప్రాంతీయ శక్తి. ఈ రెండు శక్తుల కలయిక రాష్ట్ర అభివృద్ధికి మహాశక్తి అవుతుంది. అదే మీకు భయం. బాబు ష్యూరిటీ, మోదీ గ్యారంటీ, పవన్‌ పాపులారిటీ, ఎన్డీఏ విక్టరీ ఇది. అది మీకు అర్థం అయ్యే అవాకులు చవాకులు పేలుతున్నారు. చిల్లర రాజకీయాలు చేయడంలో జగన్‌ గ్యాంగ్‌ ట్రేడ్‌ మార్క్‌ సిద్దహస్తులు. జగన్‌ మానసిక స్థితి దిగజారిపోయింది. చివరికి స్మశానాల్లో ఉన్న శిలాఫలకాలపై కూడా బొమ్మలు వేసుకోవడానికి సిద్ధం అయ్యాడు. అలాంటి వ్యక్తి మేనిఫెస్టో లో బొమ్మల గురించి మాట్లాడుతున్నాడు. దానికి బ్లూ మీడియా వంత పాడుతుంది. మద్య నిషేధం అని మద్యం ఆదాయంతో జేబులు నింపుకున్నారు. రైతులకు ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు అన్నారు. రూ.3 రూపాయలు కూడా పెట్టలేదు.

జాబ్‌ క్యాలెండర్‌ అని చెప్పారు..అదీ లేదు. లక్షల కోట్లు దోచుకుని కేంద్ర పథకాలను స్టిక్కర్లు అంటించుకుని పేదలకు ఇచ్చే బియ్యం కూడా బొక్కి రూ.50 వేల కోట్లు వేనకేశాడు. ఏపీకి మోదీ గ్యారంటీ ఉంది. బాబు ష్యూరిటీతో ఇళ్ల నిర్మాణం, ఇంటింటికి కొళాయి నీరు, ఆరోగ్య బీమా, ముద్ర రుణాలు, మహిళా సాధికారతతో పాటు ఎన్నో కేంద్ర పథకాలతో ఏపీలో ప్రజలకు మేలు జరుగుతుంది. టీడీపీ, జనసేన విడుదల చేసిన మేనిఫెస్టోకు కేంద్ర సంపూర్ణ మద్దతు ఉంది. జగన్‌ విధ్వంసకర పాలన రద్దు.. బీజేపీ కూటమి వికసిత్‌ ఆంధ్ర ముద్దు. బైబై జగన్‌.. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి జైజై ఇదే మా విధానం. ఓడిపోయాక జగన్‌ ఏ విధంగా పారిపోవాలో అంతర్గత ప్రణాళిక తయారు చేసుకుంటే మంచిందని హితవుపలికారు.

అభివృద్ధి, సంక్షేమం సమానంగా మేనిఫెస్టో
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్‌ మాట్లాడుతూ కూటమి మేనిఫోస్టోలో అభివృద్ధి, సంక్షేమం సమా నంగా ఉంది. సంక్షేమం అని చెప్పి ఎస్టీ, ఎస్సీ సబ్‌ప్లాన్‌, కార్పొరేషన్‌లకు నిధులు కేటాయించకుండా వైసీపీ మోసం చేసింది. కూటమి మేనిఫెస్టోలో బీసీలకు సాధికారత ఆర్థిక స్వావలంబన స్పష్టంగా కనిపిస్తుంది. బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు 50 సంవత్సరాలకే సామాజిక పింఛన్లు ఇస్తామని చెబితే వైసీపీ విమర్శలు చేస్తుంది. కూటమి మేనిఫెస్టోలో ప్రాంతీయ సమతుల్యతను తీసుకోవడం గొప్ప విషయం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష. దాన్ని వైసీపీ పూర్తిగా నాశనం చేసింది.

తోటపల్లి బ్యారేజ్‌ను గాలికొదిలేంది. విశాఖ రాజధాని అని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేసిందే కానీ, ఉత్తరాంధ్రలో చేసిన అభివృద్ధి లేదు. మేనిఫెస్టోలో రాయలసీమలో హార్టికల్చర్‌ హబ్‌ ప్రకటించడం జరిగింది. దాంతో రాయలసీమ అభివృద్ధి చెందుతుంది. అలాగే రాయలసీమలో ఆటో మొబైల్‌ హబ్‌ ఏర్పాటుతో పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వస్తాయి. బీసీ డిక్లరేషన్‌తో బీసీల స్వావలంబనకు తీసుకున్న చర్యలు అభినందనీయం. వడ్డెర్లు, మత్స్యకారులు, కల్లు గీత కార్మికులతో పాటు అన్ని సామాజిక వర్గాల అభివృద్ధే లక్ష్యంగా మేనిఫోస్టో ఉంది. వ్యవసాయాన్ని వైసీపీ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సోలార్‌ రాయితీ పంపు సెట్లను తొలగించారు. ఎందుకు తీశారో కారణంలేదు. ఇప్పుడు మళ్లీ దాన్ని తీసుకు వస్తాం. తొమ్మిది గంటల కరెంట్‌ ఇస్తాం. రైతులు మోసపోకుండా ఏపీఎంసీ యాక్ట్‌ను అమలుచేస్తాం. పంచాయతీరాజ్‌ డిక్లరేషన్‌తో పాటు పన్నులు, ధరల నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కల్పించి మేలు జరిగే నిర్ణయాలతో ముందుకు వెళతామని తెలిపారు.