జగన్‌ ఆస్తులను సర్కారు స్వాధీనం చేసుకోవాలి

– డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్‌

గుంటూరు, మహానాడు: నైతిక విలువలు లేకుండా సొంత తల్లి, చెల్లిపై కోర్టు ద్వారా ఇబ్బందులు పెట్టడం చూస్తే జగన్మోహన్ రెడ్డి చరిత్ర హీనుడుగా నిలవబోతున్నారు… గతంలో మీ ఆస్తులు ఎంత.. ఇప్పుడు మీ ఆస్తుల విలువ ఎంత అని డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై రాజకీయ నేతలు పార్లమెంట్ సమావేశాల్లో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి బరితెగింపు చూస్తే ఆయన వెనుక పెద్దతలకాయలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు… ప్రధాన మంత్రి దీనిపై తక్షణమే ప్రత్యేక చర్చలు పెట్టి కఠిన చర్యలకు ఉపక్రమించాలని కోరారు.

జగన్మోహన్ రెడ్డి ఆస్తులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే జాతీయకరణ చేయాలని ప్రధాని మోదీ ని కోరారు. ప్రజల ఆస్తులను అప్పనంగా దోచుకున్న జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై కూటమి ప్రభుత్వం మీనా మేషాలు లెక్కించడం సరికాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి జగన్మోహన్ ఆస్తులను ప్రభుత్వానికి చేరేలా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరిగే ఘటనలపై ప్రత్యేక కోర్టులలో విచారణ జరిపించాలని సూచించారు.