టీడీపీ దాడులపై జగన్‌ సంచలన నిర్ణయం

అమరావతి: ఎన్నికల్లో గెలుపు తర్వాత తమ శ్రేణులపై కూటమి నేతలు దాడులు చేస్తున్నట్లు జగన్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై జగన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ శ్రేణులు, సోషల్‌ మీడియా సైనికులకు అండగా ఉండేలా ప్రతి పార్లమెంట్‌ పరిధిలో కమిటీలు వేయాలని జగన్‌ ఆదేశించారు. ఈ మేరకు శరవేగంగా కమిటీలను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పా టు చేసిన ఈ కమిటీలు కార్యకర్తలకు అండగా ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి పార్లమెంట్‌ పరిధిలో ప్రస్తుత ఎమ్మెల్సీలు, పార్టీ ఎమ్మెల్యేల కు కమిటీలో స్థానం కల్పించారు.