అడవుల వినాశనానికి పాల్పడితే జైలుకు

– ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం
– మంత్రి పవన్ కళ్యాణ్

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు అందించడంపై దృష్టిపెడతానని మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయన్నారు. ‘ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం నాకు కలిగింది. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం. అడవుల వినాశనానికి పాల్పడితే ఎంతటి వారైనా జైలుకు వెళ్లాల్సిందే. సామాజిక వనాలు పెంచాల్సిన అవశ్యకత ఉంది’ అని అన్నారు.