దర్శి, మహానాడు: విజయవాడ వరద బాధితులకు టీం 99, దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు అచ్చనాల కోటి, పాపారావు, ఉల్లి బ్రహ్మయ్య ల ఆధ్వర్యంలో దుస్తులు పంపించారు. 1000 చీరలు, 200 పంజాబీ డ్రెస్సులు, 200 దుప్పట్లు, 180 షర్టులు సేకరించి ఓ వాహనంలో విజయవాడ తరలించారు. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, చైర్మన్ పిచ్చయ్య, టిడిపి నాయకులు సంగా తిరుపతిరావు, మారెళ్ల వెంకటేశ్వర్లు, పుల్లలచెరువు చిన్న, తదితరులు జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. వరద బాధితులకు తమ వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా జనసేన నాయకులు కోటి, పాపారావు, బ్రహ్మయ్య లు తెలిపారు.