కేసు నమోదు చేసి పాస్పోర్ట్ సీజ్ చేయాలి
లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని వినతి
తిరుపతి: నగరంలోని సీఐడీ కార్యాలయంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. అర్హత లేకపోయినా జగన్ ఆశీస్సులతో ఐదేళ్ల పాటు ఈవోగా వందల కోట్లు దోచేశారని, కూటమి రావడంతో ధర్మారెడ్డి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. టీటీడీలో ఆభరణాలు, నిధులు, శ్రీవారి డబ్బులు వెనకేసుకున్నారని పేర్కొన్నారు. ప్రభు త్వం ఏర్పాటు అయిన 24 గంటలు గడవకముందే లీవ్ కావాలంటే అర్థం చేసుకోవాలని, సీఐడీ కేసు నమోదు చేసి పాస్ పోర్ట్ సీజ్ చేయాలని, అవసం మైతే లుక్ అవుట్ నోటీసులు ఇవ్వాలని కోరారు. టీటీడీ లెక్కలు కొత్త ఈవో చూసిన తరువాత ఆయన రిటైర్మెంట్కు అనుమతించాలని, ఆయనపై టోల్ గేట్లలో నిఘా పెట్టాలని సూచించారు.