జన్మభూమికి బ్రేక్‌ పడింది

ప్రయాణీకులకు ఆ మూడుగంటలు నరకమే

విశాఖపట్నం: ట్రైన్‌ బోగీ లింక్‌ కట్‌ అవ్వడంతో జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ మూడుగంటలుగా నిలిచిపోయింది. విశాఖపట్టణం నుంచి విజయవాడ వైపు వెళ్లే జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరిన 2 నిమిషాలకే అవుట్‌ కట్స్‌ దగ్గర్ద ఏసీ బోగీ లింక్‌ తెగిపోయి ఆగింది. దీంతో అధికారులు ట్రైన్‌ను వెనక్కి తీసుకొచ్చి స్టేషన్‌లో నిలిపారు. ఉదయం 6:20 నుంచి ట్రైన్‌ నిలిచిపోవడంతో ప్రయాణికులు అక్కడే ఉండిపోయారు.