-జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు
-రమేష్ ఇంట్లో కీలక డాంక్యుమెట్ల స్వాధీనం
విజయవాడ: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఇబ్రహీంపట్నంలోని రమేష్ నివాసంలో మంగళవారం నాడు తెల్లవారుజామున 15 మంది అధికారుల బృందం రంగంలోకి దిగి సోదాలు చేపట్టింది. రమేష్ ఇంట్లో ఉన్న కీలక డాంక్యుమెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. చాలామంది బాధితులు ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు అధికారుల దృష్టికి రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం.
జోగి రమేష్ అవినీతికి పాల్పడినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. ప్రధానంగా ఇసుకతో పాటు పలు భూ అక్రమణలకు పాల్పడినట్లు గుర్తించారు. ఇటీవల ఆయనపై వరుసగా మీడియాలో కథనాలు వచ్చాయి. అధికారులను బెదిరించి అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారాల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
మంత్రి హోదాలో జోగి రమేష్ ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు. ఏవిధంగా ప్రభుత్వ నిబంధనలకు కాదని కాంట్రాక్ట్‌లు అప్పగించారనే కీలక విషయాలపై ఏసీబీ అధికారులు అరా తీశారు. ఇప్పటికే కీలకమైన డాంక్యుమెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయానికి సంబంధించి ఇంతవరకు ఏసీబీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.