నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్..

జూనియర్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన జానీ మాస్టర్ తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు. దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్‌గా నియమించుకున్నాడని తేల్చారు. 2020లో ముంబైలోని ఓ హోటల్‌లో జానీ తన అసిస్టెంట్‌పై లైంగిక దాడి చేసినట్లు రిపోర్ట్‌లో పేర్కొనబడింది, ఆ సమయంలో బాధితురాలిని 16 ఏళ్లుగా గుర్తించారు. నాలుగేళ్లుగా పలు సందర్భాల్లో ఆమెపై లైంగిక దాడి జరిగిందని కూడా రిపోర్ట్ పేర్కొంది. అంతేకాకుండా, ఈ సంఘటనలపై జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించిందని పోలీసులు తెలిపారు.