నరసరావుపేట రూరల్: వైసీపీ పాలన నచ్చక నరసరావుపేట నియోజకవర్గంలో పెద్దఎ త్తున టీడీపీలో చేరుతున్నారు. నరసరావుపేట మండలం పెద్దరెడ్డిపాలెం గ్రామానికి చెంది న పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇండ్లమూరి రామారావు, సంఘం డెయిరీ మాజీ డైరెక్టర్ మక్కెన ఆంజనేయులు, కపిలవాయి విజయ్‌కుమార్, బండారుపల్లి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.