విజయవాడ, మహానాడు : సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గం కార్యాలయంలో ఆదివారం సెంట్రల్ నియోజకవర్గ అధికార ప్రతినిధి రఘు నాయకత్వంలో కాపు సంఘాల నేతలు, కార్యకర్తలు 122 మంది టీడీపీలో చేరారు. టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ నియోజకవర్గం కోఆర్డినేట ర్ నవనీతం సాంబశివరావు, వీఎంసీ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, చిన్న, నరేంద్ర నాయుడు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.