50 ఏళ్ల క్రితం చంద్రబాబు ఈ స్థాయికి ఎదుగుతాడని నేను ఊహించలేదు.
ఎన్డీఏ ప్రభుత్వలో అవినీతి రాజ్యమేలుతోంది
బిజెపి పాలిత మహారాష్ట్రలో ఐఏఎస్ అధికారుల పోస్టింగులకు మంత్రులు 5 కోట్ల రూపాయలు బేరం పెట్టారు
ఒక్కో ఐఏఎస్ అధికారి నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు చేసి, పోస్టింగులు ఇస్తున్నారు
మోడీ, బిజెపి అవినీతికి ఇది నిదర్శనం
కుప్పం నుంచి వలసలు అధికం
కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్
విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను స్థిరీకరించలేకపోతున్నాయి. నిరుద్యోగం , వలసల నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి వలసలు అధికంగా ఉంది. ప్రతిరోజూ కుప్పం వాసులు వేల మంది బతుకుదెరువు కొరకు కర్నాటక వెళుతున్నారు.
చంద్రబాబు నాయుడు సొంత జిల్లా, మదనపల్లెలో టమోటా పంటలు ఎక్కువ పండిస్తారు. కిలో టమోటా రూ.100 కి అమ్ముతున్నారు.సామాన్య ప్రజలు ఏమి తినాలి! ఎలా బతకాలి? అంజయ్య ముఖ్యమంత్రిగా, భాస్కరరావు ఇరిగేషన్ మంత్రి గా పోలవరం ప్రాజెక్టుకు పునాది రాయి వేశారు.2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలు మొదలుపెట్టారు.
వైఎస్ హయాంలో ఎవరెవరికి కాంట్రాక్టులు ఇచ్చారు? ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు? నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో ఎంత ఖర్చు చేశారు.? 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పాలనలో పోలవరం ఖర్చు ఎంత?మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని వేల కోట్లు ఖర్చు చేశారు? నిర్మాణ పనులు ఎవరికి అప్పగించారు?
వైయస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పోలవరం ప్రాజెక్టు పేరుతో అంచనా వ్యయం పెంచుకుంటూ.. తమకు ఇష్టమైన వారికి కాంట్రాక్టులు ఇస్తూ… కాలయాపన చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై తెలంగాణ ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. అదే విధంగా పోలవరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి.
2019 లో 2 లక్షల 65 వేల కోట్ల అప్పులు చూపిస్తే , జగన్ హయాంలో 14 లక్షల కోట్లుగా చేశారు.నెలకు 9,000 కోట్లు వడ్డీలు కట్టాల్సి వస్తోంది. జగన్ రాష్ట్రానికి చేసిన ఘనమైన పని 14 లక్షల కోట్లు అప్పులు చేయడం. అన్ని లక్షల కోట్లు ఏమయ్యాయి? ఏమన్నా అభివృద్ధి పనులు చేశారా? జగన్ చేసిన అప్పులపై లెక్కలు చెప్పాల్సిన బాధ్యత ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉంది.
అప్పుల నుంచి రాష్ట్రాన్ని ఎలా కాపాడుతారో చంద్రబాబుకే తెలియాలి. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఈ ఐదేళ్లలో సాధించుకోవాలి. చంద్రబాబు నాయుడుకు ఢిల్లీ చుట్టూ చుట్టాల్సిన పనిలేదు. చంద్రబాబు రమ్మంటే మోడీ పరుగెత్తుకుంటూ రాష్ట్రానికి వస్తారు.
చంద్రబాబు నాయుడుకి రాజకీయ బలం ఉంది. 50 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు ఈ స్థాయికి ఎదుగుతాడని నేను ఊహించలేదు.
వచ్చే ఐదేళ్లలో పోలవరం, అమరావతి నిర్మాణం ఎలా పూర్తి చేస్తారు వేచి చూడాలి. ఇప్పటివరకు దాదాపు 40 వేల కోట్లు ఖర్చు చేశారు. ఇంకో 40 వేల కోట్లు ఉంటేగానీ, పోలవరం పూర్తి కాదు. అంత డబ్బు ఎక్కడి నుండి తెస్తారు? పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వాలు న్యాయం చేయడం లేదు.