-గెలుపు గుర్రాలపై భారీ బెట్టింగులు
-వందలకోట్లలో బెట్టింగులు
-సై అంటున్న తెలుగుదేశం శ్రేణులు
-వెనుకాడుతున్న వైసీపీ
( వాసిరెడ్డి రవిచంద్ర)
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాక బెట్టింగులు జోరందుకున్నాయి. రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయి? అధికారం ఎవరికి వస్తుంది? జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయి? మా నియోజకవర్గంలో మెజార్టీ ఎంత? తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కుప్పంలో ఎంత మెజార్టీ వస్తుందో ..పులివెందులలో జగన్ కు ఎంత మెజార్టీ వస్తుంది ..మంగళగిరిలో లోకేష్ మెజార్టీ అంత రాదు.
గుడివాడలో కొడాలి నాని ఓడిపోతాడు- గెలుస్తాడు. గన్నవరంలో వంశీ ఓడిపోతాడు. ఉండి లో రఘురామ కృష్ణంరాజు పదివేల పైగా మెజార్టీతో గెలుస్తాడు. ఎంపీ పెమ్మసానికి లక్ష పైగా మెజార్టీ వస్తుంది. కృష్ణదేవరాయ 50వేలకు పైగా మెజార్టీ వస్తుంది- రాదు! నరసరావుపేటలో అరవింద బాబు గెలుస్తున్నాడు. మెజార్టీ 5000 రాదు.
దర్శిలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గెలుస్తుంది. మాచర్లలో బ్రహ్మారెడ్డి గెలుస్తున్నాడు. జీవీ ఆంజనేయులుకు వినుకొండలో 15 వేలకు పైగా మెజార్టీ వస్తుంది. పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ కు 10,000 కు పైగా మెజార్టీ వస్తుంది. గుంటూరు టు లో కూటమి అభ్యర్థి గల్ల మాధవి గెలుస్తుంది. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ 25తో గెలుస్తున్నాడు.
ఇలా.. బెట్టింగుల జోరు గుంటూరు జిల్లాలో జోరు అందుకుంది. పార్టీ నాయకులు- కార్యకర్తలు ఎదురెదురుగా బెట్టింగులు వేసుకోవడం ఒక లెక్క అయితే, మరో లెక్క కూడా ఉంది. ఏకంగా బోర్డులోనే ఓట్లల్లో బెట్టింగులు వేస్తున్నారు. మంగళవారం బోర్డ్ లో తెలుగుదేశానికి 104 వస్తాయని వస్తాయని- 101 రావని, వైసీపీకి 74 రావని- 77 వస్తాయని, తెలుగుదేశానికి 88వస్తాయని- 85 రావని, జాతీయ స్థాయిలో బెట్టింగు నిర్వహించే వెబ్‌సైట్లు, ప్రైవేటు వ్యక్తుల తో బెట్టింగ్ రాయుళ్లు పందాలు కడుతున్న పరిస్థితి.
గుంటూరు, తూర్పు-పశ్చిమ గోదావరి- నెల్లూరు- విశాఖ జిల్లాల్లో అయితే భారీ స్థాయిలో బెట్టింగులు జరుగుతున్నాయి. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పొలాలను, పందాలకు గ్యారెంటీగా చూపిస్తుండటం విశేషం. ఈ రెండు జిల్లాల్లోనే దాదాపు 500 కోట్ల బెట్టింగులు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక విశాఖ-నెల్లూరు- గుంటూరు-కృష్ణా జిల్లాల్లో కూడా దాదాపు వెయ్యికోట్లకు పైగా, బెట్టింగులు జరుగుతున్నాయంటున్నారు. ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో చిన్న స్థాయిలోనయినా కోట్ల రూపాయల్లో బెట్టింగులు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే తెలుగుదేశం వారు బెట్టింగులకు సై అంటున్నారు. వైసీపీ మాత్రం వెను కా డుతున్నట్లు చెబుతున్నారు. లక్ష బెట్టింగ్ కాస్తే లక్షన్నర ఇవ్వాలని.. ఇలా అభద్రతతో వైసీపీ శ్రేణులు- నాయకులు, బెట్టింగుకు ముందుకు రావడంలేదని.. ఏకపక్షంగా కూటమి వైపే ఉందని, బెట్టింగులు జరుగుతున్న తీరు స్పష్టం చేస్తోంది.
ఏది ఏమైనా గుంటూరు జిల్లాలో కూటమి అభ్యర్థులకు అనుకూల పవనాలు వీ స్తున్నాయి. గుంటూరు జిల్లాలో వైసీపీకి మూడు కంటే రావని ఎక్కువ పందాలు నడిచాయి. తెలుగుదేశానికి 15 వస్తాయని పందాలు పెట్టారు. ఇలా ఎన్నికలు ముగిశాక కోట్లలో బెట్టింగులు నడుస్తున్నాయి.