సత్తెనపల్లి, మహానాడు: మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కాపుల ఆత్మీయ సమావేశంలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఫ్యాక్షన్ రాజకీ యాలు కావాలో, సంక్షేమ పాలన కావాలో ఆలోచించుకోవాలని కోరారు. మాచర్ల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తెలిపారు. కూటమిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, కాపు నాయకులు పాల్గొన్నారు.
వావిలాలకు నివాళి:
స్వాతంత్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య వర్ధంతి సందర్భంగా సోమవారం ఆ మహనీయుడికి సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ నివాళులర్పించారు.