భవన నిర్మాణ కార్మికులతో కన్నా సమావేశం

సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లిలో భవన నిర్మాణ కార్మికుల ఆత్మీయ సమావేశం బుధవారం జరిగింది. ముఖ్యఅతిథిగా సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కార్మికులను మోసం చేసిన ఏకైక ప్రభుత్వం ఉందంటే అది వైకాపా ప్రభుత్వ మాత్రమేనని విమర్శించారు. శ్రమజీవుల రక్తాన్ని పన్నుల రూపంలో, జరిమానాల రూపంలో, పెంచిన రేట్ల రూపంలో, నాసిరకం మద్యం అమ్మకాల రూపంలో జుర్రుకుంటున్న వైసీపీ ప్రభుత్వ దోపిడీ నుంచి వచ్చే ఎన్నికల్లో విముక్తి కావాలని కోరుకుంటూ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రభుత్వంలో జీవనోపాధి కోల్పోయి కుటుంబం గడుపుకోవడానికి కూడా కష్టమైంది. మళ్లీ కార్మికులు కుటుంబాలతో సంతోషంగా ఉండాలంటే కూటమితోనే అది సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.