శ్రీకృష్ణునికి కన్నా పూజలు

సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణంలోని వివిధ ప్రదేశాలు రంగా కాలనీ, శిశుమందిర్ స్కూల్ ఆవరణలో, అలాగే వడ్డవల్లి లో సోమవారం ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో మాజీ మంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగవాన్‌ శ్రీకృష్ణునికి పూజలు చేశారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ పట్టణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.