వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏఎల్ఈఏపీ(అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా) తరపున ఆ సంస్థ ప్రెసిడెంట్ కన్నెగంటి రమాదేవి రూ.50 లక్షల విరాళం అందించారు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి ఆదివారం కన్నెగంటి రమాదేవి చెక్కు అందించారు.