– ముఖ్యమంత్రిని విచారించేందుకు గవర్నర్ అనుమతి
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ధి ప్రాదికార భూ కుంభకోణం కలకలం సృష్టిస్తోంది.. దానివల్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. తాజాగా.. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముడా స్థలం కేటాయింపు కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారణ చేసేందుకు గవర్నర్ శనివారం ఉదయం ఆమోదం తెలిపారు.
దీంతో, ఈ కేసులో సీఎం సిద్దరామయ్య విచారణను ఎదుర్కోనున్నారు. దీనికి సంబంధించిన సమాచారం అందినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. సామాజిక కార్యకర్త, న్యాయవాది టి.జె. అబ్రహం, తన భార్య బీ.ఎం. పార్వతికి కేటాయించిన భూమికి సంబంధించిన కేసులో సీఎం సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతించాలని కోరుతూ కొద్ది వారాల క్రితం గవర్నర్ కు పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటీషన్ పై గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం సిద్ధరామయ్యపై విచారణకు ఆమోదం తెలిపారు. కొద్దిరోజుల ముందు తనపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ ను గవర్నర్ తిరస్కరిస్తారని సీఎం సిద్ధరామయ్య విశ్వాసం వ్యక్తం చేశారు.