Mahanaadu-Logo-PNG-Large

కేసీఆర్‌ నీ పప్పులుడకవ్‌…

రాక్షస పాలనతో తెలంగాణను దోచావు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

కంటోన్మెంట్‌, మహానాడు : తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఉద్యమ నినాదాలకు తిలోదకాలిచ్చి నియంత పాలన సాగించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన కంటోన్మెంట్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నేనే రాజు, నేనే మంత్రిని అనే విధంగా రాక్షస పాలన సాగించి తెలంగాణ సంపదను సర్వం దోచుకున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలను గౌరవించకుండా, గుర్తించకుండా వారి ఉనికే లేకుండా చేశారన్నారు. నేడు అధికారం పోగానే ప్రతిపక్షం గుర్తుకువచ్చిందని, వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టుకుపోయిన పరిస్థితిని గుర్తుకు తెస్తుందని అన్నారు. తెలంగాణ సమాజం గాలివానలో నువ్వు కొట్టుకుపోయి ఐదు నెలలు పోయింది. ఇప్పుడు నువ్వు మాజీవి. ఇప్పుడు ఆ పప్పులు ఉడకవు. మళ్లీ ఉద్యమ సెంటిమెంట్‌ రగిలించి లబ్ధి పొందాలనుకుంటున్నావు. తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌పై మాకు గౌరవం ఉంది. అందుకే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి వారి చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదని హితవుపలికారు.