రాష్ట్రాన్ని దోచేసి సిగ్గులేకుండా బస్సుయాత్ర
డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క
ఖమ్మం, మహానాడు : ఖమ్మం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సోమవారం మంత్రులు, ఎమ్మెల్యే లతో సమావేశం నిర్వహించారు. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఆస్తులను, ప్రజలను కాపాడేందుకు యువ నేత రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు. దేశంలో సంపద, వనరులను జనాభా సంఖ్యకు అనుగుణంగా పంచాలనేది రాహుల్ గాంధీ లక్ష్యం. క్రోనీ క్యాపిటలిస్టులు అంబానీ, అదానీ వంటి కొద్దిమంది తన మిత్రులకు మోదీ దేశ సంపద, సహజ వనరులను కట్టబెడు తున్నారు. ఈ రాష్ట్రాన్ని లూఠీ చేసిన బీఆర్‌ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇంటికి పంపారు.
మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్వర్‌రెడ్డి ఇళ్లల్లో కూర్చొని కరెంటు పోయిం దని మాజీ సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. పదేళ్లుగా రాష్ట్రాన్ని దోచేసి సిగ్గులేకుండా ఇప్పుడు రాష్ట్రంలో బస్సు యాత్ర చేస్తున్నారు. ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డిని భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించాలని కోరారు. త్వరలో ఖమ్మం లోక్‌సభ ఎన్నికల ప్రచార సమన్వయ కమిటీని ప్రకటిస్తామని తెలిపారు. జిల్లాస్థాయి, నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతామని వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అభ్యర్థి రఘురామిరెడ్డి, పార్లమెం టు పరిధిలోని ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.